Tirumala Samacharam 10-08-2023: కలియుగ వైకుంఠ నాథుడి చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 75,594 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,213. తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం రూ.4.69 కోట్లు చేకూరిందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. (Tirumala Samacharam 10-08-2023)
మరోవైపు టీటీడీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిన్న సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇవాళ ఉదయం బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా శాలువాతో సీఎంను భూమన సత్కరించారు. తనకు టీటీడీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు భూమన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. భూమన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు.
నిన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అన్నదాన సత్రంలో సామాన్య భక్తులతో కలిసి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ సహ పంక్తి భోజనం చేశారు. అన్నదానంలో భోజనం చాలా రుచిగా శుచిగా ఉందని కితాబిచ్చారు.
Read Also: Gold rates today 10-08-2023: తగ్గిన పసిడి ధరలు.. నేటి బంగారం రేట్లు ఇవీ..