HomeAndhra PradeshSAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ

SAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ

SAMARTH APP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” (SAMARTH-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈ యాప్ ను అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు వినియోగించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల వేళ స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ కై ఈ మొబైల్ యాప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను ఎంతో సులభంగా గుర్తించ వచ్చన్నారు. తద్వారా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను తక్షణమే పంపించేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. కంట్రోల్ రూమ్ నుండే పోలీస్ బలగాల లొకేషన్ లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చని సూచించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ మొబైల్ యాప్ ను అభివృద్ది పర్చి ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ను అభినందించారు.

బాపట్ల జిల్లా ఎస్సీ వకుల్ జిందాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ జిల్లాలో ఉపయోగిస్తున్న ఈ సమర్థ్ మొబైల్ యాప్ విశిష్టతను, విశేషాలను వివరించారు. తమ జిల్లా ఐటి కోర్ విభాగం రూపొందించిన ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా ఈ నెల 22 వ తేదీ నుండి తమ జిల్లాలో వినియోగిస్తూ మంచి ఫలితాలను సాదిస్తున్నట్లు తెలిపారు.

ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చని, ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వున్న 2000 మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాల జారీ చేయవచ్చని తెలిపారు. మొబైల్ కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా వారికి సమాచారం అందుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చే పిటిషన్లను సంబంధిత పోలీస్ అధికారులకు యాప్ ద్వారా పంపి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు.

మొత్తం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క వివరాలు, మొబైల్ నెంబర్స్ యాప్ నందు పొందుపరచబడినవి అని, తద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయడం జరుగుతుందన్నారు. అదే విదంగా సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుండి నేరుగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడానికి, సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి, శక్తివంతమైన, బలమైన మరియు నిజ-సమయ అప్లికేషన్ గా ఈ యాప్ పనిచేస్తున్నదని సి.ఇ.ఓ. శ్రీ ముకేష్ కుమార్ మీనాకు వివరించారు.

ఇవీ చదవండి: EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు