Perni Nani on CBN: చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. హిందుస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైందన్నారు. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పడు బయటకొచ్చిందన్నారు. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. పేర్ని ఇంకా ఏమన్నారంటే.. (Perni Nani on CBN)
* పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు
* రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది
* ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది
* మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది
* ఈ ముడుపులకు దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?
* సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
* చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లోమీడియా ఎందుకు స్పందించదు?
* హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు
* అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?
* ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది
* చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి
* ఎమ్మెల్సీ పోతుల సునీతపై లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడారు
* బాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు
* రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే
* భవిష్యత్తుక గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు
* మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?
* తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల దగ్గరకు బయలుదేరాడు
* అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు
* ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట
* అవసరం తీరే వరకూ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు
* లోకేశ్ పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి
* లోకేశ్ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు
* హిందుస్తాన్ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా లోకేశ్?
* ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు.
అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Read Also : Gudivada Amarnath: చంద్రబాబు అవినీతి చిట్టా బయటకొస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్