TTD Chairman: వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వచ్చే నెల 12వ తేదీతో ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతోపాటు పాలక మండలి పదవీ కాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎమ్మెల్యే భూమన ఉన్న సంగతి తెలిసిందే. (TTD Chairman)
Read Also : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
టీటీడీ చైర్మన్ పదవిని భూమన కరుణాకర్‌రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ఇప్పటికే భూమన క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని భూమన కోరుతున్నారు. తాజాగా తాడేపల్లికి వచ్చిన ఎమ్మెల్యే భూమన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
Read Also : Women Missing cases: ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యం పై కేంద్రం ప్రకటన
క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను భూమన కలిశారు. తనకు టీటీడీ చైర్మన్ పదవీ ఇవ్వాలని సీఎంను భూమన అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ సహా పాలకమండలి సభ్యుల నియామకాలపై సీఎం జగన్‌తో భూమన చర్చిస్తారని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ అయితే స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని భూమన భావిస్తున్నారు.