HomeUncategorizedJanhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌...

Janhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌ దక్కేనా?

Janhvi Kapoor Bawaal: అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ బవాల్‌. బాలీవుడ్‌లో ఈ మూవీ నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లోనే విడుదలవుతోంది. ఈనెల 21న రిలీజ్‌ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ మూవీ ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. (Janhvi Kapoor Bawaal)

Image

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు సక్సెస్‌ రుచి చూడలేకపోతున్న జాన్వీ కపూర్‌.. ఈ మూవీతో అయినా బ్రేక్‌ ఈవెన్‌ హిట్‌ మూవీ దక్కించుకుంటుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు.

Image

బవాల్ (Bawaal) సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రత్యేక రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తున్నట్లు చాలా రోజుల కిందటే టాక్‌ వచ్చింది. అనుకున్నట్లుగానే నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో (Amezon Prime Video) విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. సాజిద్ నదియావాలా ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నిజానికి గత ఏప్రిల్ 7నే రిలీజ్ అవుతోందని హీరో వరుణ్ ధావన్ చెప్పినప్పటికీ ఆ తర్వాత మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

Image

ప్రతి ప్రేమ కథకు దానిదైన యుద్ధం ఒకటి ఉంటుంది అంటూ మేకర్స్ బవాల్ ఫస్ట్ లుక్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ, వరుణ్ ధావన్ హగ్ చేసుకొని ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ల వెనుక ఈఫిల్ టవర్, కింద యుద్ధ భూమిలో తుపాకీలు చేతబట్టిన సైనికులు ఉండటం చూస్తే.. మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కనిపిస్తోందని సినిమా అభిమానులు చెబుతున్నారు.

Image

అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ఇండియాతోపాటు 200 దేశాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారీ, సాజిద్ నదియావాలా కాంబినేషన్ లో వస్తున్న సెకండ్‌ మూవీ కావడంతో ఆసక్తికరంగా మారింది. వీళ్లు 2019లో తీసిన చిచోరే సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని యూరప్ ను చూపించబోతున్నట్లు సాజిద్ గతంలో వెల్లడించాడు.

Image

Read Also : Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ

ఇక తెలుగులో ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) సరసన “దేవర” (Devara) చిత్రంలో నటిస్తోంది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). తెలుగులో నేరుగా సినిమా చేయడం తొలి సారి కావడంతో అందరూ శ్రీదేవిలా నటిస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా శ్రీదేవి అందం సొంతం కావడంతో జాన్వీ కపూర్‌కు అభిమానులు పెరిగారు. అందంతోపాటు అభినయం కూడా తోడైతే ఇక సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేందుకు ఈజీ అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.

Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు