Jagananna Chedodu: రేపే అకౌంట్లలోకి రూ.10 వేలు.. జగనన్న చేదోడు నిధుల జమ

Jagananna Chedodu: జగనన్న చేదోడు నిధులను రేపు సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేపు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ జమ చేయనున్నారు. (Jagananna Chedodu)

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలని వారికి చేదోడునిస్తూ వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10,000 చొప్పున సాయం అందిస్తోంది జగన్‌ ప్రభుత్వం. రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించింది జగన్‌ ప్రభుత్వం. ఈ 4 ఏళ్లలో కేవలం ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు.

1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి..
39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ..
1,04,551 మంది రజకులకు ఈ విడత సాయంగా రూ. 104.55 కోట్ల లబ్ధి..

లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక..
ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం…
అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ – పథకాల లబ్ది అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ. జూన్, డిసెంబర్ లలో లబ్దిని – అందచేస్తున్న జగనన్న ప్రభుత్వం.

జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటి వరకు అందించిన లబ్ధి..
2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122, సాయం రూ.298.12 కోట్లు
2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225, సాయం రూ.299.23 కోట్లు
2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145, సాయం రూ.330.15 కోట్లు
2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020, సాయం రూ.325.02 కోట్లు

ఇదీ చదవండి: Jagananna Videshi Vidya deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన.. నేడు నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles