Krishna Water: కృష్ణాజలాలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం

Krishna Water: కృష్ణా జలాలపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తమైంది. తాజా విధివిధానాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో సీఎం భేటీ అయ్యారు. కృష్ణా నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా సీఎం చర్చించారు. (Krishna Water)

కేడబ్ల్యూడీటీ-2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమంటూ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని తెలిపారు. సెక్షన్‌ 89 లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని వెల్లడించారు.

రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెబుతోందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా ఉందని అధకారులు సీఎం జగన్‌కు తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌ ఉండగా కూడా గెజిట్‌ విడుదల చేశారని తెలిపారు. అంతర్‌ రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలో క్లాస్‌ 4ను కూడా ఉల్లంఘించి ఈ విధివిధానాలు జారీచేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెబుతోందన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు జారీ చేసిందని పేర్కొన్నారు. గోదావరి నదీజలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని తెలిపారు.

అదే తెలంగాణ 214 టీఎంసీలు తరలిస్తున్నా, ఆమేరకు ఏపీ వాటాలపై మౌనం విధివిధానాల్లో వహించడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ వద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మార్గదర్శకాలపై గెజిట్‌ వెలువడిన నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి: Anti Naxal Meeting: అభివృద్ధిమంత్రంతో వామపక్ష తీవ్రవాదం తగ్గుదల.. జాతీయ సమావేశంలో సీఎం జగన్

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles