Assigned Lands bill: స్వాతంత్య్రం వచ్చిన ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా సీఎం వైయస్ జగన్ భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భూమి తన పేరుమీద ఉండి కూడా అమ్ముకోలేక, వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు వినియోగించుకోలేక సతమతమవుతున్న అసైన్డ్ భూముల సాగుదారుల కష్టాలను తీర్చారు. అసైన్డ్ భూముల విషయంలో సర్వ హక్కులూ కల్పించేలా, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా అసైన్డ్ భూములపై అన్ని హక్కులూ కల్పించేలా చట్ట సవరణకు నాంది పలికారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసిన వైయస్ జగన్.. సాగుదారుల సామాజిక హోదా పెంచేలా, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆంధ్రప్రదేశ్ భూదాన్ గ్రామదాన్ సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. (Assigned Lands bill)
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టానికి మార్పులు చేసి.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసి ఈ బిల్లును రూపొందించామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సీఎం వైయస్ జగన్ అని, అందరూ గర్వపడేలా సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి వెల్లడించారు. సోమవారం సమగ్ర భూ సర్వేపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ధర్మాన మాట్లాడుతూ..
- అసెన్డ్ ల్యాండ్స్‌పై గతంలో ఎవరూ దృష్టిపెట్టలేదు.
- వైఎస్సార్ హయాంలో 7 లక్షల ఎకరాలు అసెన్డ్ ల్యాండ్ అందజేశారు.
- లంక భూములపై సాగుదారులకు సంపూర్ణహక్కు కల్పిస్తున్నాం.
- రెవెన్యూశాఖలో సంస్కరణలు ఎంతో మేలు చేస్తున్నాయి.
- అందరూ గర్వపడేలా సంస్కరణలు తీసుకొచ్చాం.
- సంస్కరణలు చేయాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి.
- సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.
- పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారు.
- భూములు బలవంతంగా లాక్కునే పరిస్థితులు నేడు లేవు.
- అసైన్డ్ ల్యాండ్‌పై సర్వ హక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది.
- ఈ చట్ట సవరణ ద్వారా లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
- ప్రభుత్వ సంస్కరణలను అంతా అభినందించాలి.
- ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలనేదే సీఎం వైయస్ జగన్ సంకల్పం.
రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే
- రైతుపై ఒక్క రూపాయి భారం లేకుండానే సర్వే చేశాం. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది.
- భూసర్వేకు 10వేల మంది సిబ్బందిని నియమించాం. సర్వే కోసం ఇప్పటిదాకా రూ.500 కోట్లు ఖర్చు పెట్టాం.
- మరో రూ.500 కోట్లు ఖర్చు పెడతాం. 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తయింది.
- సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది.
- భూసర్వే ఓట్ల కోసం చేసింది కాదు.. భవిష్యుత్తు తరాల కోసం చేసింది.
- బ్రిటీషర్ల కాలంలో జరిగిన తర్వాత మళ్లీ సీఎం జగన్ ప్రభుత్వంలోనే భూముల సర్వే జరిగింది.
- గ్రామాల్లో తగాదాలకు క్లియర్ సరిహద్దులు లేకపోవడమే కారణం.
- ఏపీలో భూముల సర్వే దేశానికే ఆదర్శంగా ఉంటుంది. సర్వే అఫ్ ఇండియా కూడా మన సర్వేను మెచ్చుకుంది.
- రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు.
- ఆఫీసర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకముందు ఉండదు.