Ankita Lokhande Casting Couch: బాలీవుడ్ నటి అంకితా లోఖండే తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టెలివిజన్ రంగంలో స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభ రోజుల్లో దక్షిణాది సినిమా కోసం ఆడిషన్ ఇచ్చిన సమయంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఘటనను గుర్తు చేసుకుంది. అవకాశాల కోసం రాజీ పడే స్వభావం తనది కాదని, టాలెంట్‌ను మాత్రమే నమ్ముకున్నానని ఆమె స్పష్టం చేసింది.
19 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం
అంకితా లోఖండే మాట్లాడుతూ.. తాను కేవలం 19 ఏళ్ల వయసులో ముంబైలో ఒక దక్షిణాది సినిమా కోసం ఆడిషన్ ఇచ్చానని తెలిపింది. అప్పట్లో హీరోయిన్‌గా ఎదగాలనే కలతో అనేక అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది.
ఆడిషన్ పూర్తయ్యాక తనతో మాట్లాడిన వ్యక్తి మొదట “సినిమాలో అవకాశం కావాలంటే కొంత రాజీ పడాలి” అని చెప్పాడని, అతను చెప్పిన మాటల అర్థం తనకు వెంటనే తెలిసినా.. అతని నోటి నుంచే స్పష్టంగా వినాలని అనుకున్నానని అంకిత తెలిపింది.
‘నిర్మాతతో పడుకోవాలి’ అన్నాడని ఆరోపణ
అంకిత చెప్పిన ప్రకారం.. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి నేరుగా “ఈ సినిమా కావాలంటే నిర్మాతతో పడుకోవాలి” అని చెప్పాడని తెలిపింది. దానికి తాను ఏమాత్రం భయపడకుండా.. “నేను సినిమా అవకాశాల కోసం అలాంటి రాజీలు పడే అమ్మాయిని కాదు. నా ప్రతిభను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.. అని ముఖం మీదే చెప్పానని వివరించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన మాట మార్చి, సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినా.. అలాంటి వాతావరణంలో పని చేయాలని తనకు ఆసక్తి లేకపోవడంతో ఆ సినిమా చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయానని అంకిత వెల్లడించింది.
‘టాలెంట్‌తోనే గుర్తింపు రావాలి’
కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రావాలనే ఆత్రుత ఉన్నప్పటికీ, ఆత్మగౌరవాన్ని వదులుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని అంకిత పేర్కొంది. ప్రతిభ ఉంటే అవకాశాలు ఆలస్యమైనా వస్తాయని నమ్మానని, అదే తన కెరీర్‌కు బలమైందని చెప్పింది.
‘పవిత్ర రిష్తా’తో స్టార్‌డమ్
అంకితా లోఖండేకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ‘పవిత్ర రిష్తా’ టెలివిజన్ సీరియల్. ఈ సీరియల్‌లో ఆమె నటనకు విశేష ఆదరణ లభించింది. అదే సీరియల్‌లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్తో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరూ చాలా సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2016లో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అదే ఏడాది ఇద్దరూ విడిపోయారు.
విక్కీ జైన్‌తో కొత్త జీవితం
సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకితా లోఖండే 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ను వివాహం చేసుకుంది. ఈ జంట కలిసి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం అంకితా టెలివిజన్ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్‌లు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు చేరువగా ఉంటోంది.
క్యాస్టింగ్ కౌచ్‌పై మరోసారి చర్చ
అంకితా చేసిన తాజా వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో కూడా పలువురు నటీమణులు తమ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని బహిరంగంగా వెల్లడించారు. అయితే పరిశ్రమలో అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేమని, అవకాశాల కోసం అనుచిత ఒత్తిడిని ఎదుర్కొన్న వారి అనుభవాలు వ్యక్తిగతమైనవని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవీ చదవండి: Actress: ఇంత అందంగా ఉన్నా అవకాశాలు ఎందుకు రావట్లేదు..? నందిత శ్వేత లేటెస్ట్ ఫోటోలు వైరల్
Tollywood Actress: వరుస హిట్లు.. కానీ స్టార్‌డమ్ ఇంకా దూరమే.. శాన్వి మేఘన కెరీర్‌లో మిస్సవుతున్న మ్యాజిక్ ఇదేనా?
Actress Hema: నా బాధ ఎవరికీ కనిపించదా?.. మీడియాపై నటి హేమ ఆవేదన
