Saturn: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై కీలక ప్రభావం చూపుతుందని చెబుతారు. ప్రస్తుతం Pisces రాశిలో గ్రహాల కదలిక ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 వరకు మీన రాశిలో ఒకేసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంచారం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కాలంలో ముఖ్యంగా Saturn, Mars, Sun, Mercury వంటి గ్రహాల సంచారం మీన రాశిలో కొనసాగుతోంది. దీనివల్ల ఈ రాశికి అనుకూలంగా ఉండే కొన్ని రాశుల వారికి యాక్టివిటీ పెరగడం, అదృష్ట యోగాలు కలగడం వంటి ఫలితాలు కనిపించనున్నాయి.
ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఈ గ్రహ సంచారం అనేక విధాలుగా సానుకూల ఫలితాలను ఇవ్వబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితం వంటి రంగాల్లో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది.
వృషభ రాశి
Taurus వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉండనుంది. లాభ స్థానంలో శని, రవి, కుజ, బుధ గ్రహాల సంచారం కారణంగా ఈ రాశివారికి మహాభాగ్య యోగం మరియు రాజయోగం కలిగే అవకాశముంది. ఉద్యోగాల్లో పదోన్నతి, అధికారం లభించే అవకాశం ఉంది. పనిలో గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. మొత్తంగా వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది.
మిథున రాశి
Gemini వారికి ఈ నెల దశమ స్థానంలో గ్రహాల సంచారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల కోసం ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ రంగాల్లో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తి సంబంధమైన లాభాలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి
Cancer వారికి ఈ నెల భాగ్య స్థానంలో గ్రహాల సంచారం ఉండటం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్లు, పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశముంది.
కన్య రాశి
Virgo వారికి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం కారణంగా పనుల్లో బిజీ పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఈ ప్రయత్నాల వల్ల ఆదాయం పెరిగి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
Scorpio వారికి పంచమ స్థానంలో గ్రహాల సంచారం కారణంగా గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ధనయోగం ఏర్పడే అవకాశముంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగం, పెళ్లి సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెల మొత్తం సుఖసంతోషాలతో గడిచే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే మీన రాశిలో జరుగుతున్న గ్రహాల సంచారం ఈ ఆరు రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితం వంటి రంగాల్లో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Saturday Puja: శనివారం ఉదయం ఇలా మొక్కుకుంటే శ్రీ వేంకటేశ్వరుడు మీ కోరిక తప్పక నెరవేరుస్తాడట!
Sun–Saturn Conjunction: మార్చి 15న సూర్య–శని సంయోగం.. ఈ 3 రాశుల వారికి అదృష్ట కాలం!
