HomeCrime NewsSathankulam: తండ్రి–కొడుకుల కస్టడీ మృతి కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష

Sathankulam: తండ్రి–కొడుకుల కస్టడీ మృతి కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష

Sathankulam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులో తండ్రి–కొడుకుల కస్టడీ మృతి కేసులో మదురై కోర్టు సంచ‌ల‌న‌ తీర్పు వెలువరించింది. 2020లో జరిగిన సాతాంకుళం (Sathankulam) పోలీస్ కస్టడీ హింస కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన పోలీస్ దౌర్జన్య ఘటనగా గుర్తింపు పొందింది.

లాక్‌డౌన్ సమయంలో అరెస్ట్
ఈ ఘటన 2020 జూన్ 19న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని సాతాంకుళం పట్టణంలో జరిగింది. స్థానిక వ్యాపారి పి. జెయరాజ్ (P. Jeyaraj) తన షాప్‌ను లాక్‌డౌన్ నిబంధనల సమయంలో ఆలస్యంగా తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు జే.బెనిక్స్ (J.Bennix) పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరినీ పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల హింస కారణంగా ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలు
దర్యాప్తు నివేదికల ప్రకారం తండ్రి, కొడుకులను గంటల తరబడి పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతో ఇద్దరికీ పూర్తిగా కోలుకోలేని విధంగా గాయాలు అయ్యాయి. తర్వాత ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మరణించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

దేశవ్యాప్తంగా నిరసనలు
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తమిళనాడులో భారీ నిరసనలు జరిగాయి. సోషల్ మీడియాలో #JusticeForJayarajAndBennix ట్రెండ్ అయ్యింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. మద్రాస్ హైకోర్టు కూడా ఈ ఘటనపై స్వయంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. తరువాత కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేశారు.

ఆరు సంవత్సరాల తర్వాత తీర్పు
దాదాపు ఆరు సంవత్సరాల పాటు విచారణ కొనసాగిన తర్వాత మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. మొత్తం 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది ఇది “rarest of rare case”గా పరిగణించి
అందరికీ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు పోలీస్ కస్టడీ హింస కేసుల్లో అరుదుగా కనిపించే కఠినమైన శిక్షగా భావిస్తున్నారు.

మానవ హక్కుల పోరాటానికి న్యాయం?
ఈ తీర్పును మానవ హక్కుల కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. పోలీస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇది ముఖ్యమైన సందేశం అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో దోషులైన పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది. 2020లో దేశాన్ని కుదిపేసిన సాతాంకుళం కస్టడీ హింస కేసులో వచ్చిన ఈ తీర్పు పోలీస్ బాధ్యత, మానవ హక్కుల పరిరక్షణపై పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసు భారత న్యాయవ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశముంది.

ఇవీ చ‌ద‌వండి: Telugu Student Murder : నోయిడాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. ఆపై!
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
Punganur girl murder: పుంగనూరులో ముస్లిం బాలిక కిడ్నాప్, హత్యపై ప్రభుత్వ స్పందన కరువు!
Vizag Crime: విశాఖలో దారుణం.. యువతిని ముక్కలుగా నరికి హత్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు