Oracle Corporation: ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైన Oracle Corporation తాజాగా తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. కంపెనీ అంతటా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ పెద్ద స్థాయిలో రీస్ట్రక్చరింగ్ చేపట్టినట్లు సమాచారం. అంచనాల ప్రకారం ఈ లేఆఫ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రధానంగా కంపెనీ AI డేటా సెంటర్ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కారణంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విధానం
తొలగింపులకు గురైన ఉద్యోగులకు కంపెనీ నుంచి ముందస్తు హెచ్చరిక లేకుండా ఈమెయిల్ పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు అమెరికాలో ఉదయం 3 గంటలకు ఉద్యోగులకు ఈమెయిల్ వెళ్లింది. ఆ ఈమెయిల్‌లో వారి ఉద్యోగం కంపెనీ “organizational changes”లో భాగంగా తొలగించబడిందని ఆ రోజు నుంచే వారి చివరి పని రోజు అని తెలిపింది. చాలా మంది ఉద్యోగులు ఈమెయిల్ చదివిన కొద్ది సేపటికే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్ నుంచి లాక్ అవుట్ అయినట్లు తెలుస్తోంది.
సర్వరెన్స్ పేమెంట్‌కు షరతులు
కంపెనీ నుంచి సర్వరెన్స్ ప్యాకేజ్ పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా DocuSign ద్వారా termination documents సైన్ చేయాలి. సైన్ చేస్తేనే డబ్బు సైన్ చేయకపోతే ఎలాంటి సర్వరెన్స్ లేదు. అంటే “No signature – No severance” అనే విధానం అమల్లో ఉంది.
అమెరికా ఉద్యోగులకు ఇచ్చే సర్వరెన్స్
అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ఈ విధంగా ప్యాకేజ్ ప్రకటించినట్లు సమాచారం. మొదటి సంవత్సరం కోసం 4 వారాల బేసిక్ జీతం. ఆ తర్వాత ప్రతి పని చేసిన సంవత్సరానికి 1 వారం జీతం.. గరిష్టంగా 26 వారాల వరకు మాత్రమే.. అయితే ఇతర టెక్ కంపెనీలతో పోలిస్తే ఇది తక్కువ ప్రయోజనాలున్న ప్యాకేజ్గా ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
ఇతర టెక్ కంపెనీలతో పోలిస్తే
ఉదాహరణకు:
Block Inc.
20 వారాల జీతం
ప్రతి ఏడాదికి 1 వారం అదనం
6 నెలల ఆరోగ్య బీమా
$5000 స్టైపెండ్
Meta Platforms
16 వారాల జీతం
ప్రతి ఏడాదికి 2 వారాల జీతం
6 నెలల హెల్త్ ఇన్సూరెన్స్
దీనితో పోలిస్తే ఒరాకిల్ ప్యాకేజ్ చాలా తక్కువగా ఉందని టెక్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
భారత ఉద్యోగులకు పరిస్థితి
భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణంగా N+2 ఫార్ములా ప్రకారం సర్వరెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇందులో N = కంపెనీలో పనిచేసిన సంవత్సరాలు, అంతే నెలల జీతం అదనంగా 2 నెలల జీతం. అయితే ఉద్యోగులకు ఇచ్చిన unvested RSUs (స్టాక్ ఆప్షన్స్) పూర్తిగా రద్దు అవుతాయని తెలుస్తోంది.
లేఆఫ్స్ వెనుక అసలు కారణం
ఈ భారీ ఉద్యోగాల కోతలకు ప్రధాన కారణం కంపెనీ AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ.
కంపెనీ ప్రస్తుతం భారీ స్థాయిలో:
AI డేటా సెంటర్ల నిర్మాణం
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం కంపెనీ కేవలం రెండు నెలల్లోనే $58 బిలియన్ అప్పు తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కంపెనీపై భారీ ఆర్థిక ఒత్తిడిని తెచ్చింది.
ఉద్యోగాల కోతలు ఎక్కడ ఎక్కువ?
సోషల్ మీడియా మరియు ఉద్యోగుల ఫోరమ్‌ల సమాచారం ప్రకారం లేఆఫ్స్ ఈ విభాగాల్లో ఎక్కువగా జరిగాయి:
Oracle Health
Cloud
Sales
Customer Success
NetSuite IDC
RHS
SVOS
కంపెనీ పరిస్థితి
కంపెనీ షేర్ ధర కూడా గత కొద్ది నెలల్లో భారీగా పడిపోయింది. 2025 సెప్టెంబర్ నుంచి స్టాక్ విలువ సగానికి పైగా తగ్గింది అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని అమెరికన్ బ్యాంకులు కంపెనీ డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ తగ్గించినట్లు సమాచారం.
ఒరాకిల్ చేపట్టిన ఈ భారీ లేఆఫ్స్ టెక్ రంగంలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. AI రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఉద్యోగులకు ఇచ్చిన సర్వరెన్స్ ప్యాకేజ్, తొలగింపు విధానం తీవ్ర విమర్శలకు గురవుతోంది.
ఇవీ చదవండి: Microsoft | వారంలో 3 రోజులు ఆఫీసుకి రావాల్సిందే : మైక్రోసాఫ్ట్
Microsoft Edge : ఏఐతో బ్రౌజింగ్‌కు కొత్త దిశ.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ‘Copilot Mode’
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ పారితోషికం… మూడేళ్లలో ఆదాయం ఎంతంటే?
