HomeCinemaDhurandhar 2: ‘దురంధర్-2’ బాక్సాఫీస్ దూకుడు.. 14 రోజుల్లో భారీ వసూళ్లు.. పుష్ప, బాహుబ‌లి రికార్డులు...

Dhurandhar 2: ‘దురంధర్-2’ బాక్సాఫీస్ దూకుడు.. 14 రోజుల్లో భారీ వసూళ్లు.. పుష్ప, బాహుబ‌లి రికార్డులు సేఫ్‌!

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

రెండు వారాల్లో రూ.1435 కోట్ల గ్రాస్
సినిమా విడుదలై 14 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1435 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే త్వరలోనే ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీక్వెల్‌కు మంచి క్రేజ్
ఇది గతంలో వచ్చిన ‘దురంధర్’ సినిమాకు సీక్వెల్. మొదటి భాగం కేవలం హిందీలో విడుదలై రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అదే క్రేజ్‌తో రెండో భాగాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేశారు.

రెండో వారంలో తగ్గిన వసూళ్లు
మొదటి వారం భారీ వసూళ్లు వచ్చినప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి కలెక్షన్స్ కొంత తగ్గాయి. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో వచ్చే రోజుల్లో బాక్సాఫీస్ రన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి తెలుగు చిత్రాల రికార్డుల‌ను దాటడం కష్టం అవుతుంద‌ని చెబుతున్నాయి.

స్టార్ క్యాస్ట్, టెక్నికల్ టీమ్
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా, ఆర్ మాధవన్ మరియు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, హై వోల్టేజ్ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ చ‌ద‌వండి: Allu Arjun: Pushpa: The Rise తర్వాత భారీ ప్రాజెక్ట్… అల్లు అర్జున్-అట్లీ కాంబోలో నలుగురు అవతారాలు!
Dhurandhar 2 Box office: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్ ది రివెంజ్’.. తొలి వారంలోనే రూ.1000 కోట్ల రికార్డ్
Dhurandhar 2: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్ 2’.. బాహుబలి 2 రికార్డుకూ బ్రేక్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు