HomeCinemaDhurandhar 2 Box office: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్ ది రివెంజ్’.. తొలి వారంలోనే...

Dhurandhar 2 Box office: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్ ది రివెంజ్’.. తొలి వారంలోనే రూ.1000 కోట్ల రికార్డ్

Dhurandhar 2 Box office: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గతేడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ను విడుదల చేయడం ప్రత్యేకతగా నిలిచింది.

తొలి వారంలోనే రూ.1000 కోట్ల మార్క్
రిలీజ్ అయిన తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో తొలి వారంలోనే వెయ్యి కోట్ల మార్క్‌ను దాటిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్ల కలెక్షన్లు
ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1088 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్ రాగా.. ఓవర్‌సీస్ మార్కెట్‌లో రూ.274 కోట్లకు పైగా వసూలైనట్లు మేకర్స్ తెలిపారు. దేశీయంగా నెట్ పరంగా ఈ సినిమా రూ.690 కోట్లను దాటింది.

స్టార్ కాస్ట్ ఆకట్టుకుంది
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దక్షిణాది స్టార్స్ ప్రశంసలు
‘ధురంధర్ ది రివెంజ్’ సినిమాపై దక్షిణాది సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రణ్‌వీర్ సింగ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఇవీ చ‌ద‌వండి: Dhurandhar 2: పుష్ప‌రాజ్‌దే డామినేష‌న్.. బీట్ చేయ‌లేక‌పోయిన‌ దురంధ‌ర్ 2
Dhurandhar 2: దురంధర్-2 క్రేజ్ మామూలు కాదు.. కోహ్లీ, సెహ్వాగ్‌తో వైరల్ అవుతున్న వీడియో
Dhurandhar 2: “ధురంధర్ 2” క్రేజ్‌తో దశాబ్దాల సంప్రదాయానికి బ్రేక్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు