Madhampatty Rangaraj: ప్రముఖ చెఫ్ మరియు నటుడు మాధంపట్టి రంగరాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిజిల్డాను సుమారు ఏడాదిన్నర క్రితం రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జాయ్‌తో వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
దంపతుల మధ్య విభేదాలు
వివాహం తర్వాత కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. జాయ్ క్రిజిల్డాను రంగరాజ్ పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆరోపించింది. దీంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది.
గర్భిణినని ప్రకటించిన జాయ్
తాను ఆరు నెలల గర్భిణినని జాయ్ ప్రకటించడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని రంగరాజ్ చెప్పినట్లు ఆమె ఆరోపించింది. దీంతో ఈ విషయం న్యాయపోరాటంగా మారింది.
కోర్టు ఆదేశాలతో డీఎన్‌ఏ టెస్ట్
ఈ కేసులో కోర్టు సమక్షంలో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో తన కుమారుడికి తండ్రి రంగరాజే అని తేలిందని జాయ్ క్రిజిల్డా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోరాటంలో చివరకు తానే గెలిచానని ఆమె పేర్కొంది.
పోస్ట్ డిలీట్‌తో మళ్లీ చర్చ
డీఎన్‌ఏ ఫలితాల గురించి పోస్ట్ చేసిన జాయ్ క్రిజిల్డా కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేసింది. దీంతో ఈ వివాదం మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా రంగరాజ్ ఇప్పటికే లాయర్ శృతిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రిగా ఉన్నాడు.
ఇవీ చదవండి: Pregnant : వైద్యంలో అద్భుతం: ఈజిప్టులో ఒక మహిళ గర్భంలో… మొత్తం 9 మంది శిశువులు! వైద్యులు కూడా షాక్
Pregnancy after 30 : 30 ఏళ్ల తర్వాత బిడ్డను కనాలనుకుంటున్నారా?
Belly Fat After Pregnancy : ప్రసవం తర్వాత మహిళలకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చిట్కాలు
