HomeCinemaThaai Kizhavi Movie: రాధిక ‘తాయ్ కిళవి’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

Thaai Kizhavi Movie: రాధిక ‘తాయ్ కిళవి’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

Thaai Kizhavi Movie: సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తాయ్ కిళవి’ థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. తాజాగా మేకర్స్ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.

1. థియేటర్లలో బ్లాక్‌బస్టర్
‘తాయ్ కిళవి’ సినిమా ఫిబ్రవరి 27న తమిళంలో థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. లాంగ్ రన్‌లో దాదాపు రూ.80 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.

2. శివకార్తికేయన్ నిర్మాణం
ఈ సినిమాను ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ తన బ్యానర్‌లో నిర్మించారు. ఒక మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

3. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
‘తాయ్ కిళవి’ సినిమా ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

4. బామ్మ పాత్రలో రాధిక
ఈ సినిమాలో రాధిక కోపంగా ఉండే ఓ వృద్ధురాలి పాత్రలో నటించింది. ఊరిలో అందరికీ వడ్డీలకు డబ్బులు ఇస్తూ జీవనం సాగించే బామ్మగా ఆమె పాత్ర ఉంటుంది.

5. ఆసక్తికరమైన కథ
తన ముగ్గురు కొడుకులు బాధ్యతగా ఉండకపోవడంతో వారిని ఇంటి నుంచి పంపిస్తుంది. అయితే ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం మొదలవుతుంది. ఇదే సమయంలో ఆమెకు పక్షవాతం రావడంతో మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. చివరికి ఆమె చెప్పాలనుకున్న రహస్యం ఏమిటి? అనేదే సినిమా కథలో ప్రధాన ఆసక్తికర అంశం.

ఇవీ చ‌ద‌వండి: Virajitha: హీరోయిన్ కాదు.. కానీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. విశాఖ అమ్మాయి హ‌వా చూశారా?
Mamitha baiju: శ్రీలీల బాటలో మమితా బైజు.. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న పాత్రలపై దృష్టి
Nikhil Siddhartha: టాలీవుడ్ హీరో సంచ‌ల‌న ట్వీట్.. ఇలాంటి దారుణాలు ఎప్పుడు ఆగేది? కఠిన చర్యలు అవసర‌మ‌న్న నిఖిల్
Euthanasia: 13 ఏళ్ల కోమా తర్వాత హరీష్ రాణా మృతి.. భారతదేశంలో కారుణ్య మరణానికి చారిత్రాత్మక కేసు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు