HomeCinemaSathyaRaj: సినిమా చాన్సులు ఇవ్వాల‌ని చాలా వేడుకున్నా.. కానీ అలా జ‌ర‌గ‌లేదు.. న‌టుడు స‌త్య‌రాజ్ కీల‌క...

SathyaRaj: సినిమా చాన్సులు ఇవ్వాల‌ని చాలా వేడుకున్నా.. కానీ అలా జ‌ర‌గ‌లేదు.. న‌టుడు స‌త్య‌రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు

SathyaRaj: తమిళ నటుడు సత్యరాజ్ బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ నటించిన ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు భారీగా ప్రశంసలు కురిపించారు.

కోయంబత్తూరులో జననం – సినిమా పై చిన్నప్పటి నుంచే ఆసక్తి
సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. 1954 అక్టోబర్ 3న కోయంబత్తూరులో జన్మించారు. ఎంజీ రామచంద్రన్, రాజేష్ ఖన్నా వంటి నటుల ప్రభావంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది.

చిన్న పాత్రలతో మొదలైన సినీ ప్రయాణం
చెన్నైకి వెళ్లి అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. కమల్ హాసన్ నటించిన సట్టం ఎన్ కైయిల్ సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించి, తరువాత విలన్ పాత్రలు చేస్తూ గుర్తింపు పొందారు. న‌టుడు సూర్య తండ్రి శివకుమార్ వద్ద సినిమా అవకాశాలు ఇవ్వాల‌ని కోరాడ‌ట‌. కానీ, తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయవద్దని, ముందు చదువు పూర్తి చేయాలంటూ శివకుమార్ స‌ల‌హా ఇచ్చార‌ని స‌త్య‌రాజ్ గుర్తు చేసుకున్నారు. అయితే, పట్టుదల వదలకుండా చెన్నైలోనే ఉండి తన ప్రయత్నాలు కొనసాగించి అనుకున్న‌ది సాధించారు.

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విజయవంతం
1985లో వచ్చిన సావి సినిమాతో హీరోగా మారిన సత్యరాజ్, తర్వాత స్టార్ హీరోగా రాణించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తమిళం, తెలుగు సినిమాల్లో వరుసగా మంచి పాత్రలు చేస్తున్నారు. మిర్చి, బాహుబలి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి.

అవార్డులు, ఆస్తులు
సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు, ఎంజీఆర్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు లభించాయి. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు ₹60–70 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

ఇవీ చ‌ద‌వండి: Sri Satya: శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ
Botcha Satyanarayana: ఆ 25 వర్గాలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారా?
Satyam Sundaram Review: సత్యం సుందరం మూవీ రివ్యూ.. 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు