HomeEducationNCHM JEE 2026: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రవేశాలు.. ఎంట్రెన్స్ పరీక్ష తేదీ 

NCHM JEE 2026: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రవేశాలు.. ఎంట్రెన్స్ పరీక్ష తేదీ 

NCHM JEE 2026: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే NCHM JEE 2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా National Council for Hotel Management & Catering Technology (NCHM&CT) అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్లు కల్పిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కోర్సుల్లో 12 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు చివరి తేదీ
అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు
అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత పొందాలి
ఇంగ్లిష్ సబ్జెక్ట్ తప్పనిసరి
ఇంటర్ పూర్తి చేసిన లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు
దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు – రూ.1000
ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ – రూ.700
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / థర్డ్ జెండర్ – రూ.450
పరీక్ష తేదీ

NCHM JEE 2026 రాత పరీక్ష ఏప్రిల్ 25, 2026న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం
పరీక్షలో మొత్తం 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 480.
ప్రతి ప్రశ్నకు 4 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్
ప్రశ్నల విభాగాలు
Numerical Ability & Analytical Aptitude – 15 ప్రశ్నలు
Reasoning & Logical Deduction – 15 ప్రశ్నలు
General Knowledge & Current Affairs – 15 ప్రశ్నలు
English Language – 45 ప్రశ్నలు
Aptitude for Service Sector – 30 ప్రశ్నలు
ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు.

కెరీర్ అవకాశాలు
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికి హోటల్స్, క్రూయిజ్ షిప్స్, ఎయిర్‌లైన్స్, రిసార్ట్స్, టూరిజం రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కెరీర్ అవకాశాలు లభిస్తాయి.

ఇవీ చ‌ద‌వండి: 10th Exams: పదో తరగతి పరీక్షల రద్దు వార్తలపై స్పష్టత.. రేవంత్ రెడ్డి కామెంట్స్ వైర‌ల్
10th Exams: విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు.. పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన 5 సూచనలు
UPSC Civil Services Examination: మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా టాప్.. డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి UPSC విజయగాథ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు