HomeTelanganaTGRJC CET-2026: తెలంగాణ‌ కేజీబీవీల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

TGRJC CET-2026: తెలంగాణ‌ కేజీబీవీల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

TGRJC CET-2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 93 పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు.

MPC, BiPC, CEC గ్రూపుల్లో అవకాశాలు
ఈ విద్యాలయాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో MPC, BiPC, CEC గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్య అందించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

TGRJC CET-2026 ద్వారా ప్రవేశాలు
దరఖాస్తు చేసిన విద్యార్థినులు తప్పనిసరిగా TGRJC CET-2026 ప్రవేశ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కేజీబీవీ విద్యాలయాల్లో సీట్లు కేటాయిస్తారు.

ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు అవకాశం
ఆసక్తి ఉన్న విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత విద్యతో పాటు ప్రత్యేక ప్రాధాన్యం
కేజీబీవీల్లో సీటు పొందిన విద్యార్థినులకు చదువు, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ అన్నీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. బడిబయట ఉన్న బాలికలు, అనాథలు, 40% వైకల్యం ఉన్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన సీట్లలో జనరల్ 50%, ఎస్సీ 15%, ఎస్టీ 6%, బీసీ 29% రిజర్వేషన్లు అమలు చేస్తారు.

ఇవీ చ‌ద‌వండి: Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధులు తొలి విడ‌త‌లో ఎవ‌రెవ‌రికి వ‌స్తాయంటే..
Students : అమెరికాలో ఐటీ కంటే అర్చకులకే ఎక్కువ డిమాండ్? డాలర్లలో జీతాలు… లక్షల్లో ఆదాయం!
Telugu Student Murder : నోయిడాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. ఆపై!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు