HomeNationalStudents : అమెరికాలో ఐటీ కంటే అర్చకులకే ఎక్కువ డిమాండ్? డాలర్లలో జీతాలు… లక్షల్లో ఆదాయం!

Students : అమెరికాలో ఐటీ కంటే అర్చకులకే ఎక్కువ డిమాండ్? డాలర్లలో జీతాలు… లక్షల్లో ఆదాయం!

Students : ఒకప్పుడు అమెరికా అంటే మనకు గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, భారీ ప్యాకేజీలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఐటీ ఇంజనీర్లకన్నా ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్న వృత్తి ఏంటో తెలుసా? మన సంప్రదాయ అర్చక వృత్తి! చదువు పెద్దగా లేకపోయినా, తీవ్రమైన పోటీ లేకుండానే… కొందరు పూజారులు అమెరికాలో ఐటీ ఉద్యోగులకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆలయాల్లో అర్చకులకు భారీ ప్యాకేజీలు
అమెరికాలోని హిందూ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఫిక్స్‌డ్ జీతాలే లక్షల రూపాయల స్థాయిలో ఉంటున్నాయి.
కొత్తగా చేరే పూజారులకు ఏడాదికి 30,000 – 45,000 డాలర్లు (సుమారు రూ.25–37 లక్షలు)
అనుభవం, సీనియారిటీ ఉన్నవారికి 80,000 – 1,00,000 డాలర్లు వరకు (దాదాపు రూ.80 లక్షల వరకు)

ఇవే కాదు… చాలా ఆలయాలు ఉచితంగా ఇల్లు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నాయి. అంటే జీతంలో ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సేవ్ అవుతోంది.

దక్షిణ, ప్రైవేట్ పూజలతో అదనపు ఆదాయం
జీతంతో పాటు భక్తులు ఇచ్చే దక్షిణలు మరో పెద్ద ఆదాయం. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ మొత్తాలు డాలర్లలోనే వస్తాయి.
ఇంటి పూజలు, సత్యనారాయణ వ్రతాలు: 5,000 – 10,000 డాలర్లు
పెళ్లిళ్లు, పెద్ద హోమాలు: 20,000 – 40,000 డాలర్లు
మంచి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న నెలల్లో కొందరు పూజారులు అక్షరాలా రూ.10 నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారట. ఈ స్థాయిలో సేవింగ్స్ చాలామంది ఐటీ ఉద్యోగులకు కూడా సాధ్యం కావడం లేదని అంటున్నారు.

స్టూడెంట్స్ కూడా రూట్ మార్చుతున్నారు
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుండటంతో కొందరు భారతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ పూజారులుగా మారుతున్నారని సమాచారం. భక్తికి భక్తి, సంపాదనకు సంపాదన అన్నట్టుగా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. పోటీ తక్కువగా ఉండటంతో వీసా సంబంధిత సమస్యలు కూడా కొంతవరకు సులభంగా పరిష్కారమవుతున్నాయట. గ్రీన్ కార్డులు పొందిన అర్చకులు కూడా చాలామందే ఉన్నారు.

ఇప్పుడు అమెరికాలో కోడింగ్ తెలిసినవాడికన్నా, వేదం తెలిసినవాడికే ఎక్కువ క్రేజ్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సంప్రదాయ వృత్తికి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న గౌరవం, ఆదాయం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా మన సంస్కృతికి దక్కుతున్న గుర్తింపుగా చెప్పుకోవచ్చు.

ఇవీ చదవండి: Crime : రీల్స్ పిచ్చి: ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం రన్నింగ్ ట్రైన్‌ను ఆపిన ఇంటర్ విద్యార్థులు!
Viral news : 400 మీటర్ల ప్రయాణానికి రూ.18 వేలు వసూలు.. ముంబైలో విదేశీ యువతికి చేదు అనుభవం… టాక్సీ డ్రైవర్‌పై పోలీసుల చర్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు