HomeCinemaEk Din Official Trailer: సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ట్రైలర్...

Ek Din Official Trailer: సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్… మే 1న ప్రేక్షకుల ముందుకు

Ek Din Official Trailer: సౌత్‌లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా ‘Ek Din’ ట్రైలర్ బుధవారం (మార్చి 11) విడుదలై సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమా ఒక సున్నితమైన ప్రేమకథ నేపథ్యంలో రూపొందింది. ఒక ఇంటర్నేషనల్ టూర్ సందర్భంగా ఇద్దరు సహోద్యోగుల మధ్య ఏర్పడిన ఒక రోజు పరిచయం వారి జీవితాలను ఎలా మార్చిందన్న అంశంతో కథ సాగుతుంది. ట్రైలర్ ప్రారంభం సరదాగా మొదలై క్రమంగా భావోద్వేగాలకు దారితీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో రోహన్ పాత్రలో జునైద్ ఖాన్, మీరా పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. మీరాపై ప్రేమ ఉన్నప్పటికీ తన భావాలను వ్యక్తం చేయడానికి రోహన్ భయపడుతుంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? ఆ ఒక్క రోజు వారి జీవితాలను ఎలా మార్చింది? అన్నదే ఈ చిత్ర కథలో ప్రధాన మలుపు.

ట్రైలర్‌లో సాయి పల్లవి తన సహజమైన నటనతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి గ్లామర్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం నటనతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకునే ఆమె స్టైల్ ఈ సినిమాలో కూడా కనిపిస్తోంది. మరోవైపు జునైద్ ఖాన్ కూడా తన పాత్రలో సహజంగా కనిపిస్తూ మంచి ఇంప్రెషన్ కలిగించాడు.

ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. భావోద్వేగాలు, ప్రేమ, జీవిత విలువలను చెప్పే కథగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవీ చ‌ద‌వండి: Sai Pallavi: సూపర్ ఫామ్‌లో సాయి పల్లవి.. నార్త్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి తిరిగి సౌత్‌పై ఫోకస్
Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం.. స్టార్ హీరో తనయుడితో క్లాసిక్ లవ్ స్టోరీ!
Sreeleela: హిట్లు దూరమైనా క్రేజ్ తగ్గని యంగ్ హీరోయిన్.. మంచి హిట్ కోసం అమ్మ‌డు వెయిటింగ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు