Dhurandhar: గతేడాది విడుదలైన Dhurandhar సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. దర్శకుడు Aditya Dhar తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో Ranveer Singh హీరోగా నటించగా, సారా అర్జున్ కథానాయికగా కనిపించింది. అలాగే R. Madhavan, Sanjay Dutt, Akshaye Khanna, Arjun Rampal కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా Dhurandhar: Revenge తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర కోసం ప్రముఖ నటుడు Anil Kapoorను దర్శకుడు ఆదిత్య ధర్ సంప్రదించారట. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో దీనిపై అనిల్ కపూర్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
“ఆదిత్య నన్ను సంప్రదించి ధురంధర్ 2లో ఒక గెస్ట్ రోల్ ఉంది, చేస్తావా అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. చేయాలనే ఆసక్తి ఉన్నా డేట్స్ సమస్య వల్ల ఆ ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది” అని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ “ఒక ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను వదిలేయడం నాకు ఇష్టం ఉండదు. అదే నిబద్ధత వల్లనే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. టాలెంట్ మాత్రమే కాదు, కమిట్‌మెంట్ కూడా చాలా ముఖ్యం” అని అన్నారు.
అనిల్ కపూర్ చివరిసారిగా Subedaar సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. భవిష్యత్తులో దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి పని చేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: Dhurandhar 2: ధురంధర్ 2 నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్.. అంచనాలు పెంచేస్తోన్న చిత్రం
Dhurandhar-2 telugu trailer: ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ విడుదల.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ రచ్చ
Ranveer Singh: రన్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. బాలీవుడ్‌లో కలకలం
