We The Women: సినిమాల్లో ఐటం సాంగ్స్ పేరుతో మహిళలను చూపించే విధానం ఆందోళనకరంగా మారిందని సీనియర్ నటి Shabana Azmi అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన We The Women కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఐటం సాంగ్స్‌లో మహిళల్ని చూపించే తీరు, పాటల లిరిక్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
శరీర అవయవాలపై ఫోకస్
షబానా అజ్మీ మాట్లాడుతూ… ప్రస్తుతం ఐటం సాంగ్ అనగానే కథకు సంబంధించిన అంశాల కంటే హీరోయిన్ శరీర అవయవాలను ఎలా చూపించాలన్నదానిపైనే దృష్టి పెడుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కెమెరా యాంగిల్స్ కూడా దర్శకుల ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
కథకు సంబంధం లేకుండా సాంగ్స్
చాలా సినిమాల్లో కథకు అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్‌ను బలవంతంగా చేర్చుతున్నారని ఆమె అన్నారు. ఆ పాటల్లో మహిళలను పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపించడం సరైంది కాదని విమర్శించారు.
లిరిక్స్ కూడా ఇబ్బందికరం
ఇలాంటి పాటల లిరిక్స్ కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయని షబానా పేర్కొన్నారు. “ఇప్పుడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే చిన్నపిల్లలు కూడా Choli Ke Peeche Kya Hai అంటూ పాడుతున్నారు. ఆ పాట అర్థం ఏమిటో ఎవరూ ఆలోచించరు, కేవలం సరదాగా పాడేస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజం కూడా ఆలోచించాలి
ఇలాంటి పాటలను ప్రేక్షకులు పెద్దఎత్తున ఆదరించడం కూడా సమస్యగా మారిందని షబానా అజ్మీ అన్నారు. సినిమా నిర్మాతలు మాత్రమే కాదు, సమాజం కూడా ఈ అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఐదు జాతీయ అవార్డులు
హిందీ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన షబానా అజ్మీ అనేక అవార్డులు అందుకున్నారు. Arth, Khandhar, Paar, Godmother వంటి సినిమాల్లో నటనకు గాను ఆమె ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె Dabba Cartel అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు.
ఇవీ చదవండి: Tamannah item song: తమన్నా ఐటమ్ సాంగ్.. ఏఐ వెర్షన్‌లో ఎలా ఉంటుందంటే.. కట్టిపడేస్తున్న వీడియోలు!
Tamannah : ఆఫర్స్ కాదు.. డిమాండ్ టాప్ గేర్! 6 నిమిషాలకు రూ.6 కోట్లా? తమన్నా సంచలనం!
