HomeCinemaGeetha Govindam: ర‌ష్మిక చేసిన మూవీ మిస్ అయ్యా.. సీక్రెట్ గాసిప్ వెల్ల‌డించిన లావ‌ణ్య త్రిపాఠి

Geetha Govindam: ర‌ష్మిక చేసిన మూవీ మిస్ అయ్యా.. సీక్రెట్ గాసిప్ వెల్ల‌డించిన లావ‌ణ్య త్రిపాఠి

Geetha Govindam: మెగా హీరో Varun Tejను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నటి Lavanya Tripathi వ్యక్తిగత జీవితంలో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం కుటుంబం, పిల్లల సంరక్షణలో ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఆమె గతంలోలా వరుసగా సినిమాలు చేయడం లేదు. అయితే పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం Sathi Leelavathi త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

రిలీజ్‌కు రెడీ అయిన ‘సతీలీలావతి’
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదట మార్చి 6న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లావణ్య త్రిపాఠి వరుసగా మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది.

‘గీత గోవిందం’ మిస్ అయ్యా
ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకుంది. “నేను ఇప్పటివరకు పెద్దగా సినిమాలను రిజెక్ట్ చేయలేదు. అలాగే ఎలాంటి రిగ్రెట్ కూడా లేదు. అయితే కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా కథ వినకముందే ‘నో’ చెప్పాను. తర్వాత కథ విన్న తర్వాత ‘యెస్’ అన్నాను. కానీ అప్పటికే ఆ అవకాశం నా చేతుల్లో నుంచి జారిపోయింది. చివరికి ఆ సినిమాలో Rashmika Mandanna నటించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది” అని లావణ్య తెలిపింది.

ఆ సినిమా ‘గీత గోవిందం’
లావణ్య చెప్పిన వివరాల ప్రకారం ఆమె మిస్ చేసిన సినిమా Geetha Govindam అని నెటిజన్లు గుర్తిస్తున్నారు. ఈ సినిమాలో Vijay Deverakonda మరియు రష్మిక మందన్నా జంటగా నటించి భారీ విజయాన్ని అందుకున్నారు.

విజయ్ – రష్మికకు శుభాకాంక్షలు
ఆ సినిమా గురించి మాట్లాడిన లావణ్య త్రిపాఠి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంటకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం లావణ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవీ చ‌ద‌వండి: Lavanya Tripathi Files Cyber Crime Complaint: పోలీసుల‌ను ఆశ్ర‌యించిన మెగా కోడ‌లు.. ఏమైందంటే.. సోషల్ మీడియాలో త‌న‌ను..
Lavangam: రోజుకో లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?
Allu Arjun: తల్లికి లగ్జరీ కారు గిఫ్ట్ చేసిన అల్లు అర్జున్.. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సర్ప్రైజ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు