HomeCinemaJason Sanjay: విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ నిర్ణయం… తమిళనాట చర్చనీయాంశం

Jason Sanjay: విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ నిర్ణయం… తమిళనాట చర్చనీయాంశం

Jason Sanjay: తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రముఖ నటుడు, Vijay కుమారుడు Jason Sanjay తన తండ్రి ఇంటి పేరును తొలగించుకోవడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

తండ్రి పేరు తొలగించిన జాసన్ సంజయ్
ప్రస్తుతం జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న “సిగ్మా” అనే సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్ కార్డులో ఆయన తన తండ్రి విజయ్ ఇన్షియల్‌ను ఉపయోగించకుండా, తన తల్లి పేరు ఇన్షియల్‌ను చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. జాసన్ సంజయ్ తన తల్లి Sangeetha Sornalingam పేరు నుంచి వచ్చే ‘S’ ఇన్షియల్‌ను ఉపయోగిస్తూ క్రెడిట్స్‌లో చూపించినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో వైరల్
ఇప్పటికే జాసన్ సంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా తండ్రి విజయ్‌ను ఫాలో అవ్వడం మానేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై అభిమానులు, సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

విజయ్ కుటుంబ విషయాలు కూడా చర్చలో
ఇదే సమయంలో మరో వార్త కూడా తమిళ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ భార్య సంగీత ఇటీవల చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు పిల్లలకు జీవన భృతి చెల్లించాలని కోర్టును కోరినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై విజయ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక స్పందన మాత్రం ఇంకా రాలేదు.

రాజకీయాల్లో బిజీగా విజయ్
ఇక మరోవైపు Tamilaga Vettri Kazhagam అధినేతగా విజయ్ రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా మారారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన ఈ వార్తలు బయటకు రావడంతో తమిళనాట ఇది పెద్ద చర్చగా మారింది.

ఇవీ చ‌ద‌వండి: Vijay Trisha: విజయ్–త్రిష రిలేషన్‌పై ఖుష్భూ రియాక్ష‌న్.. అలా ఎందుకు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు
Vijay Sangeetha: విజయ్–సంగీత విడాకుల వివాదం.. త్రిషతో కనిపించిన వీడియోపై నటి సనం శెట్టి ఆగ్రహం
Vijay: విడాకుల రూమర్లపై తొలిసారి స్పందించిన విజయ్.. “నా సమస్యలను నేనే చూసుకుంటా”

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు