Vaishnavi Chaitanya: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి Vaishnavi Chaitanya మరో ఆసక్తికర దశలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో కొత్త అవకాశాల దిశగా సాగుతోంది.
చిన్న పాత్రల నుంచి హీరోయిన్ వరకూ
మొదటగా ‘Ala Vaikunthapurramuloo’, ‘Rang De’, ‘Tuck Jagadish’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. అయితే ఆమెకు నిజమైన బ్రేక్ ఇచ్చింది Baby. ఇందులో Anand Deverakonda సరసన హీరోయిన్‌గా నటించి మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల ప్రేమతో పాటు అవార్డులు కూడా దక్కించుకుంది.
కోలీవుడ్ ఎంట్రీపై హాట్ టాక్
ప్రస్తుతం ‘ఎపిక్: ది సెమిస్టర్’ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్న వైష్ణవి చైతన్య త్వరలో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు-నటుడు G. V. Prakash Kumar హీరోగా, దర్శకుడు Vignesh Karthick తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో వైష్ణవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ‘హాట్‌స్పాట్ టూ మచ్’ సినిమాతో దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అలాంటి చిత్రంలో తెలుగమ్మాయి వైష్ణవి హీరోయిన్‌గా నటిస్తే, అది ఆమె కెరీర్‌కు కీలక మలుపు కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే తమిళ అనుభవం
గమనించాల్సిన విషయం ఏమిటంటే – Ajith Kumar నటించిన ‘Valimai’ సినిమాలో వైష్ణవి చిన్న పాత్రలో కనిపించింది. అయితే హీరోయిన్‌గా కోలీవుడ్‌లో ఇది ఆమె తొలి చిత్రం అవుతుందని టాక్.
ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన రాకపోయినా, ప్రచారం మాత్రం బలంగా సాగుతోంది. నిజమైతే వైష్ణవి చైతన్యకు ఇది మరో పెద్ద అవకాశంగా మారనుంది.
ఇవీ చదవండి: Ramya Krishnan: రమ్యకృష్ణతో విడిపోయారన్న వార్తలు అవాస్తవం.. వ్యక్తిగత జీవితం, కుమారుడు, పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు
GV Prakash : జీవీ ప్రకాశ్ సిస్టమ్ స్టార్ హీరోయిన్ అని మీలో ఎంత మందికి తెలుసు?
