HomeAndhra PradeshAndhra Pradesh: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వ భరోసా

Andhra Pradesh: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వ భరోసా

Andhra Pradesh: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu భరోసా ఇచ్చారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయంపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ అధికారులు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వారిని వెంటనే సంప్రదించి, అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని చెప్పారు.

ఎయిర్‌పోర్టులు మూసివేయడం, విమాన సర్వీసులు రద్దు కావడంతో వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, పరిస్థితులు చక్కబడేవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సీఎం సూచించారు. ఈ ప్రక్రియలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేసి సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

24 గంటల హెల్ప్‌లైన్ సేవలు
గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.

📞 హెల్ప్‌లైన్ నెంబర్: 0863-2340678
📱 వాట్సాప్ నెంబర్: 85000 27678
ఈ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

అదనంగా, helpline@apnrts.com, support@apnrts.com, info@apnrts.com ఈమెయిల్ ఐడీలకు కూడా సంప్రదించవచ్చు. https://apnrts.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.

ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి, అవసరమైన సహాయం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి: Iran-Israel war: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత్‌పై.. పెట్రోల్, బంగారం ధరలు పెరగనున్నాయా?
Shweta tiwari: నెలకు రూ.500 జీతం నుంచి రూ.81 కోట్ల ఆస్తుల వరకు: శ్వేతా తివారి స్ఫూర్తిదాయక ప్రయాణం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు