MacBook: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం Apple Inc. మరోసారి ల్యాప్‌టాప్ మార్కెట్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే వారం తక్కువ ధరలో కొత్త లో-కాస్ట్ మ్యాక్‌బుక్ ను విడుదల చేయనున్నట్లు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు ప్రీమియం ల్యాప్‌టాప్‌లకే పరిమితమైన Apple, ఈసారి బడ్జెట్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టడం విశేషం. ఈ కొత్త మ్యాక్‌బుక్ ధర 500 నుంచి 700 డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. భారత కరెన్సీలో చూస్తే సుమారు ₹40,000 – ₹60,000 మధ్య ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
12.9 అంగుళాల డిస్‌ప్లే – ఐఫోన్ చిప్ పవర్
ఈ కొత్త మ్యాక్‌బుక్‌లో సుమారు 12.9 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న MacBook Air కంటే కొద్దిగా చిన్నదైనా, పోర్టబిలిటీ పరంగా మంచి ఎంపికగా ఉండనుంది. ముఖ్యంగా ఇందులో A18 Pro లేదా A19 Pro చిప్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. ఇవే చిప్‌లు తాజా iPhone 16 Pro మరియు రాబోయే iPhone 17 Pro మోడళ్లలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ చిప్ పనితీరు దాదాపు MacBook Air (M1, 2020) స్థాయిలో ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
2015 మ్యాక్‌బుక్‌కు రీ-ఎంట్రీ
Apple 2015లో విడుదల చేసిన 12-ఇంచ్ మ్యాక్‌బుక్ డిజైన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే అప్పటి Intel ప్రాసెసర్లు బలహీనంగా ఉండటం, ఓవర్‌హీటింగ్ సమస్యల కారణంగా ఆ మోడల్ 2019లో నిలిపివేశారు. ఇప్పుడు Apple Silicon టెక్నాలజీతో అదే కాన్సెప్ట్‌ను మరింత శక్తివంతంగా తిరిగి తీసుకురానుంది.
మార్కెట్‌పై భారీ ప్రభావం?
ప్రస్తుతం Appleలో అత్యంత చవకైన ల్యాప్‌టాప్ MacBook Air M4 కాగా, దాని ధర ఎక్కువగానే ఉంది. కొత్త లో-కాస్ట్ మ్యాక్‌బుక్ వస్తే:
✅ విద్యార్థులకు
✅ కంటెంట్ క్రియేటర్లకు
✅ ఆఫీస్ యూజర్లకు
✅ మొదటిసారి Mac కొనేవారికి
ఇది గేమ్-చేంజర్ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే వారం సోమవారం నుంచి బుధవారం మధ్య Apple కొత్త డివైసులను ప్రకటించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: Apple Foldable iPhone: రూ.1.6 లక్షల ఫోల్డబుల్ ఐఫోన్‌కు రంగం సిద్ధం.. 2026లో మిలియన్ల యూనిట్లు మార్కెట్లోకి!
Apple Macbook Pro : కొత్త మాక్‌బుక్ ప్రో కోసం రెండు నెలల వెయిటింగ్.. M5 Pro, M5 Max మోడళ్లపై యాపిల్ త్వరలో ప్రకటన?
