HomeAndhra PradeshYS Jagan in Pulivendula: పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ పర్య‌ట‌న‌.. క్యాంప్ కార్యాల‌యంలో జ‌నంతో మ‌మేకం

YS Jagan in Pulivendula: పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ పర్య‌ట‌న‌.. క్యాంప్ కార్యాల‌యంలో జ‌నంతో మ‌మేకం

YS Jagan in Pulivendula: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ప్రజలతో మమేకమయ్యారు. పులివెందుల చేరుకున్న ఆయన భాకరాపురం క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మంచి రోజులు ముందున్నాయని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని ధైర్యమిచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.

ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు.

టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూ­డదన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పు­డు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులై­న ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్‌ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ నేత­లు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్ట­డ­మే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశా­రు.

కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని.. ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు.

జనమే జనం..
వైయస్‌ జగన్‌ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కార్యాలయ ప్రాంగణమంతా జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్‌ జగన్‌ నినాదాలతో హోరెత్తింది. జగన్‌ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan Longest PC : సినిమా చూపించిన జ‌గ‌న్.. ఏక‌బిగిన 2.45 గంట‌ల ప్రెస్ మీట్.. అప్పులు, విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, ల‌డ్డూ, ఇందాపూర్, హెరిటేజ్ వ‌ర‌కు.. ఆధారాల‌తో నాన్ స్టాప్ బ్యాటింగ్!
ys jagan vijay : ఒకే వేదిక‌పై వైఎస్ జ‌గ‌న్, విజ‌య్.. చెన్నైలో జ‌రిగిన వివాహ వేడుక‌లో సెల‌బ్రిటీల సంద‌డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు