Punarnavi Bhupalam: తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి Punarnavi Bhupalam జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించిన పునర్నవి, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే Bigg Boss Telugu Season 3 ద్వారా ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లో Rahul Sipligunjతో ఏర్పడిన లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ షో ముగిసిన తర్వాత ఇద్దరూ తమ తమ దారుల్లో కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.
ప్రేమ నుంచి పెళ్లి దాకా
కొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని సెటిల్ కాగా, ఇప్పుడు పునర్నవి కూడా తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే తన ప్రియుడు హేమంత్ వర్మను సోషల్ మీడియాలో పరిచయం చేసిన పునర్నవి, అతడి ప్రపోజల్‌కు ‘ఎస్’ చెప్పిన విషయాన్ని వెల్లడించింది. అప్పట్లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
నిశ్చితార్థం జరిగిందా?
తాజా సమాచారం ప్రకారం పునర్నవి – హేమంత్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో లగ్నపత్రిక రాసి, అధికారికంగా వీరి సంబంధాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను పునర్నవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఆ ఫోటోల్లో నీలిరంగు చీరలో పునర్నవి ఎంతో అందంగా మెరిసిపోతోంది. అయితే ప్రస్తుతానికి ఆమె తన సింగిల్ పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.
అభిమానుల్లో శుభాకాంక్షల వెల్లువ
పునర్నవి ఎంగేజ్‌మెంట్ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. బిగ్‌బాస్ రోజులను గుర్తు చేసుకుంటూ, ఆమెకు హ్యాపీ మ్యారెడ్ లైఫ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి తేదీపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.
ఇవీ చదవండి: Marriage Age gap : వివాహంలో వయస్సు అంతరం: నిజంగా ఎంత ముఖ్యమో తెలుసా?
Marriage : యువకులారా.. పెళ్లి కావడం లేదా? ఏ గుడికి వెళ్లాలి? ఏ దేవుడిని మొక్కాలి? దైవ అనుగ్రహంతో వివాహ యోగం ఎలా కలుగుతుంది?
Marriage : పెళ్లికాని యువకులు ఎందుకు పెరుగుతున్నారు? మారుతున్న సమాజం… మారిపోతున్న ఆలోచనలు
