HomeCinemaMahesh Babu: వార‌ణాసిలో సీక్రెట్ క్యారెక్ట‌ర్ రివీల్.. ప్ర‌కాశ్ రాజ్ ఎలా క‌నిస్తాడో తెలుసా? మహేష్...

Mahesh Babu: వార‌ణాసిలో సీక్రెట్ క్యారెక్ట‌ర్ రివీల్.. ప్ర‌కాశ్ రాజ్ ఎలా క‌నిస్తాడో తెలుసా? మహేష్ బాబు మూవీ అప్‌డేట్

Mahesh Babu: పాన్ ఇండియా స్థాయిలోనే కాదు… పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ Varanasi. డైరెక్టర్ S. S. Rajamouli దర్శకత్వంలో సూపర్ స్టార్ Mahesh Babu హీరోగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ Priyanka Chopra మందాకిని పాత్రలో, మలయాళ స్టార్ Prithviraj Sukumaran కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్‌ను జక్కన్న రిలీజ్ చేయగా… అవి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విలక్షణ నటుడు Prakash Raj కూడా వారణాసి సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. గతంలోనే ఒకసారి ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించగా, ఇప్పుడు తన పాత్ర గురించి స్పష్టత ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఓ డిబేట్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్… తాను వారణాసి సినిమాలో మహా శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ తనకు నటుడిగా తృప్తినిచ్చిందని, రాజమౌళి, మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌లతో కలిసి పని చేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పారు. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కూడా వెల్లడించారు.

ఇదే సందర్భంలో ఆయన మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాను త్వరలో రానున్న Drishyam 3 లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మొత్తానికి, స్టార్ క్యాస్ట్‌తో పాటు బలమైన పాత్రలతో వారణాసి సినిమా మరోసారి ఇండియన్ సినీ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చ‌ద‌వండి: Varanasi : రాజమౌళి ‘వారణాసి’కు అనూహ్య అడ్డంకి… ఈసారి టెన్షన్ ఇండియాలో కాదు, హాలీవుడ్‌లో!
Varanasi: మహేష్‌బాబు డెడికేషన్ అంటే ఇదే! ‘వారణాసి’ కోసం సూపర్‌స్టార్ చేస్తున్న కఠోర ప్రాక్టీస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు