శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
National

Rashtriya Swayamsevak Sangh : రిటైర్మెంట్‌పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. సంఘ్ సంప్రదాయాలపై స్పష్టత

ప్రచురణ తేదీ: సోమవారం, 9 ఫిబ్రవరి 2026

Rashtriya Swayamsevak Sangh : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh – ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ తన రిటైర్మెంట్‌పై, అలాగే సంఘ్‌లో నాయకత్వ మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వయసు, పదవీకాలం అనే అంశాల కంటే సంఘ్ లక్ష్యాలు, బాధ్యతలే ముఖ్యమని స్పష్టం చేశారు. తనకు ప్రస్తుతం 75 ఏళ్లు ఉన్నప్పటికీ తాను పూర్తిగా యాక్టీవ్‌గా ఉన్నానని, సంఘ్ ఆదేశిస్తే వెంటనే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని భగవత్ పేర్కొన్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా కొనసాగాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు.

చరిత్రలో రిటైర్మెంట్ సంప్రదాయం లేదు
సంఘ్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరినీ “రిటైర్ కావాలి” అని చెప్పిన సందర్భం లేదని భగవత్ గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్‌లో పదవులు ఎన్నికల ద్వారా కాకుండా, సంఘ్ అవసరాలు, సేవా సామర్థ్యం ఆధారంగా నిర్ణయించబడతాయని చెప్పారు.

“చివరి రక్తపుబొట్టు వరకు సేవ”
సంఘ్‌లో బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చివరి శ్వాస వరకు సేవ చేయాల్సిందేనని, అవసరమైతే సంఘ్ పూర్తిగా వినియోగించుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిగత అధికారం కోసం కాదు, దేశసేవ కోసం ఏర్పడిన వ్యవస్థ అని స్పష్టం చేశారు.

రాజకీయ వర్గాల్లో చర్చ
భగవత్ వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా వయస్సు పరిమితి, నాయకత్వ మార్పులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భగవత్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలు ఎంత బలంగా ఉన్నాయో, వ్యక్తుల కంటే సంస్థే ముఖ్యమనే భావనను మరోసారి స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: Central Cabinet Changes: కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. బండి సంజయ్‌కి స్థానం?
Union Budget 2026-27: యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు: మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకంపై మోదీ ప్రభుత్వ ఫోకస్

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading