HomeAndhra PradeshAP Weddings 2026 : మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు.. ఫిబ్రవరి నుంచి ఏపీలో సందడి.....

AP Weddings 2026 : మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు.. ఫిబ్రవరి నుంచి ఏపీలో సందడి.. 2026లో వివాహ ముహూర్తాలు ఇవే

AP Weddings 2026 : దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మాఘ మాసం ప్రారంభంతో శుభముహూర్తాలు ఖరారుకావడంతో వధూవరుల కుటుంబాల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 5 నుంచి వివాహాల జోరు ప్రారంభం కానుండగా, వేసవి కాలం మొత్తం పెళ్లిళ్లతో కళకళలాడనుంది.

ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా వివాహ ముహూర్తాలు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు అడ్వాన్స్ బుకింగ్‌లతో నిండిపోతున్నాయి.

2026 వివాహ ముహూర్తాలు ఇవే..
ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26, 27, 30
డిసెంబర్: 1, 2, 3, 4, 6, 11, 12, 13

ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే చాతుర్మాస విరామం కారణంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివాహ ముహూర్తాలు ఉండవు. జూలై 11 తర్వాత నవంబర్ 20 వరకూ పెళ్లి బాజాలకు నాలుగు నెలల విరామం కొనసాగనుంది.

పెళ్లంటే ఆడంబరం.. సంబరం
పెళ్లి అంటే కేవలం ఒక వేడుక కాదు.. కుటుంబాల ఆనందం, సంప్రదాయం, ఆడంబరం అన్నీ కలిసిన మహోత్సవం. నిశ్చితార్థం నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, వివాహం, రిసెప్షన్ వరకు ప్రతి దశను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 46 నుంచి 48 లక్షల వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ (Confederation of All India Traders) అంచనా వేస్తోంది. వీటి ద్వారా సుమారు రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్టు వెల్లడించింది.

ఏపీలో నాలుగు లక్షల పెళ్లిళ్లు!
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు సుమారు నాలుగు లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెళ్లి వేడుకల సందడి ఎక్కువగా ఉండనుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్ద ముహూర్తాలు ఉండటంతో అప్పటికే భారీగా బుకింగ్‌లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

వెడ్డింగ్ ఇండస్ట్రీకి పండుగే
పెళ్లిళ్లు ఎందరికో ఉపాధి కల్పించే పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాయి. దుస్తులు, బంగారం, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫోటోగ్రఫీ రంగాలకు ఇది పండుగ సమయం. రాష్ట్రవ్యాప్తంగా ఈ రంగాల ద్వారా రూ.25 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోని ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. అలాగే ఉభయ గోదావరి ప్రాంతాలు, విశాఖ తీర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు హబ్‌లుగా మారుతున్నాయి.

అందుకే..
👉 ముహూర్తం ముందరున్నది అంటూ
👉 వధూవరుల కుటుంబాలు ఇప్పటినుంచే ఏర్పాట్లలో బిజీ అయ్యాయి.
ఈ ఏడాది పెళ్లి బాజాల మోత ఏపీ అంతటా గట్టిగానే వినిపించనుంది.

ఇవీ చదవండి: Rajasthan News : జైలు గోడల మధ్య మొదలైన ప్రేమకథ.. కోర్టు అనుమతితో పెళ్లివరకు!
Medak Crime : మెదక్‌లో సంచలనం: ప్రేమ పెళ్లి తర్వాత పేరెంట్స్ కౌన్సిలింగ్.. పోలీసుల ముందే యువతిని..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు