Tollywood: ఒకప్పుడు తెరపై చిన్నారి పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అమాయకమైన ముఖం, సహజమైన నటనతో సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ చిన్నారి పూర్తిగా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆ అమ్మడు.. తాజాగా హీరోయిన్ స్థాయి మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. “ఇంతగా మారిపోయిందా?” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మలయాళ సినిమాలతో కెరీర్ స్టార్ట్
ఈ అందాల భామ కెరీర్ మలయాళ సినిమాలతో ప్రారంభమైంది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తన సహజ నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కుటుంబ కథాచిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మలయాళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్న ఈ చిన్నారి.. రెండు భాషల ప్రేక్షకుల మన్ననలు పొందింది.
వెంకటేశ్ కూతురిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర
తెలుగులో ఆమెకు అసలైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘దృశ్యం’. వెంకటేశ్ – మీనా జంటగా నటించిన ఈ సూపర్ హిట్ మూవీలో వెంకీ చిన్న కూతురిగా ఆమె చేసిన నటన అప్పట్లో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ‘దృశ్యం’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ఆమె రెండు భాగాల్లోనూ అదే పాత్రను పోషించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె ప్రదర్శనకు దర్శకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

ఎస్తర్ అనిల్.. చదువుకి కూడా టాప్ ప్రాధాన్యం
ఆ చిన్నారి మరెవరో కాదు.. హీరోయిన్ ఎస్తర్ అనిల్. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే చదువుపై కూడా సమానంగా దృష్టి పెట్టిన ఆమె, అరుదైన నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తైన సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకున్నాయి. సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
హీరోయిన్‌లా మారిపోయిన మేకోవర్
ఇటీవల ఎస్తర్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ డ్రెస్‌లో సింపుల్ అయినప్పటికీ స్టైలిష్ లుక్‌తో ఆమె కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసిన ప్రేక్షకులకు.. ఇప్పుడు ఆమెను చూస్తే హీరోయిన్‌నే అన్న ఫీలింగ్ వస్తోంది. “ఫుల్ హీరోయిన్ మెటీరియల్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మళ్లీ సినిమాల వైపు అడుగులు
చదువు పూర్తి కావడంతో ఎస్తర్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని కథలు వింటోందని, సరైన పాత్ర వస్తే బలమైన రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎస్తర్ చాలా యాక్టివ్. తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా అపార గుర్తింపు
కేరళకు చెందిన ఎస్తర్ అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే గట్టిపునాది వేసుకుంది. ‘జోహార్’, ‘దృశ్యం’ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ఇప్పుడు చదువుతో పాటు గ్లామర్, గ్రేస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్న ఎస్తర్.. త్వరలో హీరోయిన్‌గా పూర్తి స్థాయిలో కనిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి: Rukmini Vasanth : ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కన్నడ భామ రుక్మిణీ వసంత
Anikha Surendran: సోషల్ మీడియాలో అదరగొడుతున్న అందాల భామ అనికా.. ఫొటోలు
