HomeCrime NewsHyderabad Crime : ఇదెక్కడి దారుణం తల్లీ.. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తానూ ఆత్మహత్య...

Hyderabad Crime : ఇదెక్కడి దారుణం తల్లీ.. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. పసి బిడ్డ ప్రాణం ఎలా తీయాలనిపించింది?

Hyderabad Crime : హైదరాబాద్ మహానగరంలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఇద్దరు అమాయక ప్రాణాలను బలిగొన్నాయి. కూతురు, మనవడి మరణాన్ని తట్టుకోలేక ఒక తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న సుష్మ (27)కు నాలుగేళ్ల క్రితం చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యశ్వంత్ రెడ్డితో వివాహమైంది. ఈ దంపతులకు యశ్వవర్ధన్ రెడ్డి (10 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో కుటుంబ సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సుష్మ తల్లి లలిత (44) ఇటీవల ఫంక్షన్ షాపింగ్ నిమిత్తం కూతురు ఇంటికి వచ్చింది. అయితే కుటుంబ కలహాల వల్ల మానసిక ఒత్తిడికి లోనైన సుష్మ గురువారం (జనవరి 8) తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లి ఇంట్లోనే ఉన్న సమయంలో బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సుష్మ తన 10 నెలల కుమారుడికి విషమిచ్చి చంపింది. అనంతరం తాను ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇంట్లోకి వెళ్లిన లలిత కూతురు, మనవడిని విగతజీవులుగా చూసి తీవ్రంగా కలత చెందింది. ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డి తలుపులు లోపల నుంచి మూసి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ భార్య, కుమారుడు మృతి చెంది ఉండగా, అత్త లలిత అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లలితను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుష్మ, పసికందు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమా, మరే ఇతర అంశాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఈ విషాద ఘటన నగరవ్యాప్తంగా విషణ్ణతను మిగిల్చింది.

ఇవీ చదవండి: Hyderabad Crime : హైదరాబాద్‌లో దారుణం.. వేరే వ్యక్తితో భార్య కనిపించిందని భర్త ఏం చేశాడంటే..
America : ప్రాణం తీశాడు.. దేశం దాటాడు.. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య వెనుక షాకింగ్ ట్విస్ట్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు