Bollywood : ఇటీవలి కాలంలో సినీ, టెలివిజన్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు వస్తున్నాయి. ప్రేమను బహిరంగంగా ప్రకటించినవారు, పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించినవారు ఒకవైపు ఉంటే… మరికొందరు మాత్రం విడాకుల ప్రకటనలతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే అలాంటి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. చాలా కాలంగా లవబుల్ కపుల్‌గా పేరొందిన ఓ స్టార్ జంట తమ బంధానికి ముగింపు పలికినట్లు ప్రకటించింది.
టీవీ ఆడియన్స్‌కు బాగా తెలిసిన జంట Jai Bhanushali – Mahi Vij. దాదాపు 16 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించిన ఈ జంట, ఇప్పుడు విడిపోయే నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్‌కు గురయ్యారు.
గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, ముఖ్యంగా గత ఏడాది నుంచే సంబంధంలో సమస్యలు పెరిగినట్లు సమాచారం. అయితే వీటిపై ఎలాంటి గాసిప్స్‌కు తావు ఇవ్వకుండా, స్పష్టమైన ప్రకటనతోనే విడిపోతున్నట్లు తెలిపారు.
విడాకుల ప్రకటనతో పాటు జై–మహి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి కూడా చేశారు. తాము వేర్వేరు దారుల్లో నడుస్తున్నా, తమ పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా కొనసాగుతామని పేర్కొన్నారు.
“ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ లేదా డ్రామా లేదు. మేము కేవలం ప్రశాంతతను ఎంచుకున్నాం. ఒకరినొకరం గౌరవిస్తూనే ఉంటాం. మా మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుంది. ఈ సమయంలో మాకు మీ ప్రేమ, గౌరవం, దయ అవసరం” అని తమ సందేశంలో వెల్లడించారు.
ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఆదర్శ జంటగా నిలిచిన ఈ ఇద్దరి విడిపోతున్న వార్త అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. అయినప్పటికీ, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలన్న వారి నిర్ణయానికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.
ఇవీ చదవండి: Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు
Delhi High Court: పరస్పర అంగీకార విడాకులపై కీలక తీర్పు.. ఏడాది విడివిడిగా జీవించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు
