HomeAndhra PradeshAP SET 2025 : నోటిఫికేషన్ విడుదల: పరీక్ష తేదీలు, అర్హతలు ఇవే!

AP SET 2025 : నోటిఫికేషన్ విడుదల: పరీక్ష తేదీలు, అర్హతలు ఇవే!

AP SET 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మరియు యూనివర్సిటీల్లో లెక్చరర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP SET) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను విశాఖపట్నంలోని Andhra University విడుదల చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం, AP SET 2025 రాత పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 9 నుంచి ప్రారంభం కాగా, ఫిబ్రవరి 9, 2026 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.

అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జనరల్ / EWS అభ్యర్థులకు కనీసం 55% మార్కులు అవసరం.
SC, ST, BC, PwD, థర్డ్ జెండర్ వర్గాలకు కనీసం 50% మార్కులు సరిపోతాయి.
ప్రస్తుతం మాస్టర్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం
మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్–1: టీచింగ్ & రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (అందరికీ తప్పనిసరి)
పేపర్–2: మొత్తం 30 సబ్జెక్టుల్లో ఎంపిక చేసిన సబ్జెక్ట్‌పై పరీక్ష

హాల్ టికెట్లు & దరఖాస్తు వివరాలు
హాల్ టికెట్లు మార్చి 19 నుంచి డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటాయి.
అధికారిక వెబ్‌సైట్లు: http://www.apset.net.in, http://www.andhrauniversity.edu.in

లేట్ ఫీజులు:
ఫిబ్రవరి 25 వరకు: రూ. 2,000 ఆలస్య రుసుముతో
మార్చి 5 వరకు: రూ. 5,000 అధిక ఆలస్య రుసుముతో

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా AP SET నిర్వహణ బాధ్యతలను ఆంధ్రా యూనివర్శిటీనే చేపట్టనుంది. ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: SSC 2025 Exam Date: స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల.. జనవరి 28, 29 తేదీల్లో పరీక్షలు
Collectors Conference : మార్చి 2026 నాటికి సోలార్ 2.93 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు