HomeAstrologyVastu Tips : దరిద్రం పోయి.. కోటీశ్వరులు అవుతారా? 2026లో తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు...

Vastu Tips : దరిద్రం పోయి.. కోటీశ్వరులు అవుతారా? 2026లో తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు తెలుసుకోండి..

Vastu Tips : కొత్త సంవత్సరం దగ్గర పడుతుండటంతో చాలా మంది రిజల్యూషన్లు తీసుకుంటారు. మరికొందరు మాత్రం ఈ ఏడాది అయినా తమ జీవితంలో ఆరోగ్యం, డబ్బు, శాంతి కలిసి రావాలని కోరుకుంటారు. ఇందుకోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే 2026లో మీ దరిద్రం పోయి ఆర్థికంగా బలపడాలనుకుంటున్నారా? అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న ఈ విషయాలు మీకోసమే.

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే వాస్తు నిపుణులు ఇంటి నిర్మాణం నుంచీ రోజువారీ అలవాట్ల వరకు వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా రాబోయే 2026 సంవత్సరం సంఖ్యా పరంగా ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు.

2026 సంఖ్యలను కలిపితే (2+0+2+6 = 10 → 1+0 = 1) మొత్తం ఫలితం 1 వస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం నెంబర్ వన్ సూర్య భగవానుడికి సంబంధించినది. అందువల్ల 2026ను “సూర్య సంవత్సరంగా” కూడా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది సూర్యుడి అనుగ్రహం పొందినవారికి అదృష్టం కలిసి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

2026లో సూర్య అనుగ్రహం పొందాలంటే..
ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడిని ప్రార్థించడం ఎంతో శుభప్రదం.
ఇంటి తూర్పు దిశలో సూర్యుడి ప్రతిమ లేదా చిత్రం ఉంచి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు.
ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు విశ్వాసం.

అలాగే కొత్త సంవత్సరంలో ఇంటి తూర్పు భాగాన్ని ఎరుపు రంగుతో అలంకరించడం వల్ల సూర్యుడి శక్తి మరింత బలపడుతుందట. దీని ఫలితంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవడం, అప్పుల భారం తగ్గడం, ఆర్థిక స్థిరత్వం రావడం వంటి మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వివాహ, ఆర్థిక సమస్యలకు వాస్తు పరిష్కారం
2026లో వివాహం నిశ్చయం కావాలని ఎదురుచూస్తున్నవారు, లేదా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు—
పూజా గదిలో ఏకముఖ రుద్రాక్ష లేదా పన్నెండు ముఖాల రుద్రాక్ష ఉంచి నిత్యం పూజించడం మంచిదని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీర్వాదం లభించి, కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుందట.

మొత్తానికి, 2026లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలంటే సూర్యుడిని ఆరాధించడం, వాస్తు నియమాలను పాటించడం ఎంతో కీలకమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: CC Camera : ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఏ దిశలో పెడితే వాస్తుపరంగా మంచిది? – తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమాలు
Vastu Tips : ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా? కారణం వాస్తు దోషమే కావచ్చు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు