HomeTelanganaGood News for women: మ‌హిళ‌ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత చీరల పంపిణీలో...

Good News for women: మ‌హిళ‌ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత చీరల పంపిణీలో ఈసారి కొత్త డిజైన్‌

Good News for women: తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత చీరల పంపిణీ పథకం ఈ ఏడాది కూడా కొనసాగనుంది. అయితే ఈసారి చీరల డిజైన్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మహిళలకు ఆకర్షణీయంగా ఉండేలా చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్‌తో కూడిన చీరలను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో చీరల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు కోటి చీరల తయారీకి రూ.450 కోట్లతో టెస్కోకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.

నేత కార్మికులకు ఉపాధి.. సిరిసిల్లకు భారీ ఆర్డర్లు
ఈ చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నేత కార్మికులకు అప్పగించనున్నారు. దీని వల్ల వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు సంక్షేమం అందించడమే కాకుండా నేత పరిశ్రమకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 86 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో మహిళలకు చీరలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

సీఎం ఎంపిక చేసిన కొత్త డిజైన్
ఈసారి మహిళలకు ఇవ్వబోయే చీరల విషయంలో ప్రత్యేకంగా డిజైన్ ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ మరియు మెప్మా సంస్థల అధికారులు కొన్ని నమూనాలను సిద్ధం చేసి సీఎం ముందు ఉంచారు. అందులో చిలకపచ్చ రంగుతో ఎరుపు జరీ డిజైన్ కలిగిన చీరలను సీఎం ఎంపిక చేశారు. ఈసారి పంపిణీ చేసే అన్ని చీరలు ఇదే డిజైన్‌లో ఉండాలని అధికారులకు సూచించారు.

గత తప్పులు పునరావృతం కాకూడదని సీఎం ఆదేశాలు
గతంలో చీరల పంపిణీలో కొన్ని చోట్ల ఆలస్యాలు, సరఫరా సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే సమయంలో పంపిణీ చేయాలి. అక్టోబర్ నాటికి చీరల తయారీ పూర్తి చేయాలి. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

మహిళల సంక్షేమం.. నేత పరిశ్రమకు ప్రోత్సాహం
తెలంగాణలో ఉచిత చీరల పంపిణీ పథకం మహిళల సంక్షేమంతో పాటు నేత పరిశ్రమ అభివృద్ధికి కూడా దోహదపడుతోంది. ఈ పథకం ద్వారా లక్షలాది మహిళలకు ఉపయోగం కలగడమే కాకుండా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్త డిజైన్‌తో వచ్చే చీరలు మహిళలకు మరింత ఆకర్షణీయంగా ఉండనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: Good News: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు
Good News: తిరుమల భక్తులకు శుభవార్త.. తిరుపతి వెళ్లే పలు రైళ్లు రెగ్యూలర్ సర్వీసులుగా మార్పు
Good News AP: పేదలకు మరో శుభవార్త.. 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. సూళ్లూరుపేటలో ఇళ్ల పంపిణీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు