UGC NET 2025 Exam Dates: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2025కు సంబంధించిన రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తాజాగా సబ్జెక్ట్‌వైజ్‌గా పరీక్షల తేదీలను ప్రకటిస్తూ అభ్యర్థులకు స్పష్టత కల్పించింది.
ఇప్పటికే ఈ ఏడాది అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించనున్న తేదీలను ఎన్టీఏ ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన విడివిడిగా షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం UGC NET డిసెంబర్ 2025 పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ (CBT) విధానంలో జరుగుతాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. యూజీసీ నెట్‌ను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించడం తెలిసిందే.
రెండు షిఫ్టుల్లో పరీక్షలు
పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టులుగా జరుగుతాయి.
షిఫ్ట్–1: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
షిఫ్ట్–2: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
సిటీ ఇంటిమేషన్, అడ్మిట్ కార్డులు
పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు పరీక్షకు 10 రోజుల ముందే విడుదల చేస్తారు. అనంతరం అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
UGC NET అర్హతతో లభించే అవకాశాలు
UGC NET పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందే అవకాశం ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హత కలుగుతుంది. అంతేకాకుండా పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా UGC NET అర్హత కీలకంగా ఉపయోగపడుతుంది.
ఇవీ చదవండి: RRC Railway Jobs 2025: ఇంటర్ అర్హతతో సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు – రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
ISRO VSSC Jobs 2025: రాత పరీక్షలేకుండా ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు – దరఖాస్తు వివరాలు ఇక్కడే
