HomeCinemaTollywood: మిస్ యూనివర్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ – ‘జెట్లీ’ నుండి ఫస్ట్ లుక్ అవుట్… హీరో...

Tollywood: మిస్ యూనివర్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ – ‘జెట్లీ’ నుండి ఫస్ట్ లుక్ అవుట్… హీరో ఎవరో తెలుసా?

Tollywood: టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరించిన ఫన్నీ ద్వయం — నటుడు సత్య, దర్శకుడు రిథేష్ రానా — ఈసారి ‘జెట్లీ’ అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. విమానం పైన కూర్చుని “I am done with comedy” అని చెప్పే సత్య లుక్ హిలేరియస్‌గా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

క్లాప్ ఎంటర్టైన్‌మెంట్‌కి చెందిన చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. రెండు పెద్ద బ్యానర్లు కలిసి తయారు చేస్తుండటంతో ఇది స్కై-లెవెల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని టాలీవుడ్ టాక్.

ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రియా సింఘా ఓ స్టైలిష్ యాక్షన్ లేడీగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. విమానం లోపల పేలుళ్ల మధ్య తుపాకీ పట్టుకుని నిలబడిన ఆమె లుక్ బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంది. ఎగిరే శిథిలాలు, డ్రామాటిక్ లైటింగ్, యాక్షన్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి ఆమె పాత్రను ఇంకా హైలైట్ చేశాయి.

రిథేష్ రానా ప్రత్యేక నేరేషన్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ విజన్, మైత్రి మూవీ మేకర్స్ బ్యాకింగ్ కలయికతో ‘జెట్లీ’ మరో హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ అవుతుందని స్పష్టమవుతోంది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ టీమ్‌లో:
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సరంగం
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైన్: నార్ని శ్రీనివాస్

రిథేష్ రానా స్టైల్‌కు సొంతమైన యూనిక్ రైటింగ్, ఆకట్టుకునే క్యారెక్టర్లు, కామెడీ–యాక్షన్ బ్లెండ్‌తో ‘జెట్లీ’ ప్రేక్షకులను అలరించబోతోంది.

ఇవీ చదవండి: OTT Movie : OTTలో దుమ్మురేపుతున్న మూవీ: మగాళ్లు మాత్రం మిస్ అవ్వకూడదు! తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోన్న సెటైరికల్ డ్రామా
OTT Movies This Week: 20+ కొత్త రిలీజ్‌లు… ఆ రెండు మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వకండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు