Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ సినిమా ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం నిజంగానే వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రారంభం నుంచే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్, విడుదలైన టీజర్‌తో హైప్‌ను మరింత పెంచింది.
ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2027 మార్చిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ ఫస్ట్ లుక్, టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు. “ఇదే కావాలి… బాక్సాఫీస్ దుమ్ము రేపబోతోంది” అంటూ అభిమానులు పూనకాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అధికారికంగా టైటిల్ ‘వారణాసి’గా ఖరారైంది.
టీజర్‌లో మహేష్ లుక్, రాజమౌళి విజువల్ ట్రీట్మెంట్ చూసి ప్రేక్షకులు మైండ్ బ్లాంక్ అయ్యేంతగా ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన కొత్త రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహేష్ బాబు సినిమాలో ‘రుద్ర’గా కనిపిస్తారని ముందే వెల్లడైంది. అలాగే మహేష్ లార్డ్ రాముడిగా కూడా ప్రత్యక్షమవుతారని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇవి కాకుండా మహేష్ మరో మూడు భిన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఆయన ఐదు పాత్రల్లో దర్శనమివ్వబోతున్నాడని వార్తలు హీట్‌గా మారాయి.
ఈ వార్త మహేష్ అభిమానుల్లో సూపర్ ఎనర్జీని నింపింది. అయితే, ఇవన్నీ నిజమేనా? అధికారిక ధృవీకరణ రాకపోవడంతో, ఫ్యాన్స్ ఇంకా అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇవీ చదవండి: Samantha : మహేష్ బాబు నాపై కోప్పడ్డారు.. ఏంటీ అసలు కథ? పాత వీడియో మళ్లీ వైరల్
Mahesh Babu : మహేష్ బాబు జీవితంలో టాప్ 10 విశేషాలు
