Ration Cards: రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రయోజనాలను ప్రకటించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం, 2026 జనవరి 1 నుంచి రాగులు మరియు గోధుమ పిండిని ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రేషన్ పొందే లక్షలాది కుటుంబాలు మరింత లబ్ధి పొందనున్నాయి.
అదే సమయంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం పంపిణీలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి నుంచి QR కోడ్ ఆధారిత కొత్త ట్రాకింగ్ విధానం అమల్లోకి రానుంది. ప్రతి బియ్యం సంచిపై QR కోడ్ ద్వారా నిల్వలు, తరలింపు, పంపిణీపై పూర్తి సమాచారాన్ని పారదర్శకంగా పరిశీలించవచ్చు.
కేంద్ర మంత్రితో చర్చలు – అదనపు ధాన్యం కేటాయింపు
దిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో నాదెండ్ల మనోహర్ మరియు రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ సమావేశమై ధాన్యం కొనుగోళ్లు, రాగులు – గోధుమల సరఫరా, పీడీఎస్ పంపిణీపై చర్చించారు.
మనోహర్ వెల్లడించిన వివరాలు:
ఏపీకి రాగులు, గోధుమలను అదనంగా కేటాయించడానికి కేంద్రం అంగీకరించింది.
ఉత్తర తీరప్రాంత జిల్లాల్లో ఆగస్టు 2025 నుంచే రాగుల పంపిణీ ప్రారంభమైందని, ప్రస్తుతం 16,000 మెట్రిక్ టన్నుల రాగి పీడీఎస్‌లో అందుబాటులో ఉందని తెలిపారు.
AP దేశంలోనే మొదటిసారిగా QR కోడ్ ఆధారిత బ్యాగ్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేసిన రాష్ట్రమని, దీని ద్వారా ప్రతి బ్యాగ్‌ను లీజర్ స్థాయి వరకు ట్రేస్ చేయగలుగుతున్నామని మనోహర్ గర్వంగా పేర్కొన్నారు.
అంతేకాక, అరటి, మామిడి, పత్తి వంటి పంటల్లో వచ్చిన అనుకోని మార్పులపై నివేదిక సమర్పించామని, రైతుల సమస్యలపై సీఎం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారని వివరించారు.
రైతుల ధాన్యం కొనుగోళ్లు – 24 గంటల్లోనే డబ్బు జమ
కేంద్రం 2025–26 ఖరీఫ్ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు:
2.69 లక్షల మంది రైతుల నుండి 17.37 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసింది
రోజువారీ సేకరణ పరిమాణం 90,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుగుతోందని, ముఖ్యంగా డబ్బులను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామనే విషయాన్ని మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వం 7.87 కోట్ల గోనెసంచులు సిద్ధం చేసి రైతులకు అందించినట్లు చెప్పారు. మిల్లర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండడంతో గత రెండు వారాల్లోనే 96,000 మెట్రిక్ టన్నుల 10% బ్రోకెన్ రైస్ డెలివరీ చేసినట్లు తెలిపారు.
కేంద్రం ప్రశంసించిన ఏపీ – CMR పంపిణీలో దేశంలో ముందంజ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, AP ప్రభుత్వం CMR (Custom Milled Rice) ను సకాలంలో, నిరంతరంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రశంసించారు.
డెలివరీలను వేగవంతం చేయడానికి FCI అదనపు నిల్వలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిందని మనోహర్ తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రం పీడీఎస్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకుంటున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: Andhra Pradesh: అమాయకంగా కనిపిస్తారు… కానీ దొంగతనాల్లో మామూలు వారు కారు!
Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లకు రైతులు వాట్సాప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
