TTD : తిరుమలలో లాగా, దేశంలోని ఇతర టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రుచికరంగా, శుచిగా, అధిక నాణ్యతతో అన్నప్రసాదం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.
ఇటీవలి రోజుల్లో తిరుమలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరాలు అందించిన టీటీడీ చైర్మన్, ఈవోలకు అనేక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అనంతరం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈవో కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
15 ఆలయాల్లో ఇప్పటికే సేవ – మరికొన్ని త్వరలో
ప్రస్తుతం టీటీడీ పరిధిలోని 15 ఆలయాల్లో అన్నప్రసాదం అందిస్తున్నారు.
ఈ నెల డిసెంబర్ 31 నుంచి మరో 19 ఆలయాల్లో కూడా ఈ సేవ ప్రారంభమవుతుంది.
అదే విధంగా, మిగిలిన 26 ఆలయాల్లో 2026 ఫిబ్రవరి 28 నుంచి ఉచిత అన్నప్రసాదం అందుబాటులోకి రానుంది.
భక్తుల రద్దీకి తగ్గట్లుగా సన్నాహాలు
టీటీడీ అంచనా ప్రకారం:
సాధారణ రోజుల్లో: 1,500 – 2,000 మంది
వారాంతాల్లో: 10,000 మంది వరకు
పర్వదినాల్లో: 25,000 మంది వరకు భక్తులు ఇతర ఆలయాలకు విచ్చేస్తున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో అన్నప్రసాదాల వితరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
పోటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ప్రతి ఆలయంలో అందించే అన్నప్రసాదంపై రోజువారీ రిపోర్ట్
నాణ్యత, పరిశుభ్రతపై కఠిన పర్యవేక్షణ
అన్య మత ఉద్యోగులపై పూర్తి నివేదిక
టీటీడీలో ఎవరైనా అన్య మతస్తులు పనిచేస్తున్నారా? అనే విషయంపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి సమర్పించాలని ఈవో ఆదేశించారు.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలకు:
అవసరమైన అర్చకుల సంఖ్య
వేదపారాయణ దారుల అవసరం
సేవా సిబ్బంది వివరాలు
సమగ్ర నివేదికగా అందించాలని సూచించారు.
అన్ని ఆలయాలకు SOP తప్పనిసరి
ప్రతి టీటీడీ ఆలయానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) తయారు చేయాలని ఈవో స్పష్టం చేశారు.
ఈ SOPను వచ్చే సమావేశానికి అందజేయాలని ఆదేశించారు.
అలాగే టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు పోటు ఉద్యోగుల పదవీ పేర్లను:
ముఖ్య పాచిక
పాచిక
అని మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖతో సమన్వయం చేయాలని సూచించారు.
అర్బన్ డెవలప్‌మెంట్ సెల్ బలోపేతం
నగరాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందితో క్రమబద్ధమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశించారు. అదే విధంగా, శ్రీనివాస కళ్యాణాలు తరచూ నిర్వహించేందుకు ముందుగానే Calendar of Events రూపొందించాలని కూడా సూచించారు.
అమరావతి వేంకటేశ్వర ఆలయంపై ప్రత్యేక దృష్టి
అమరావతి వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఈవో స్పష్టం చేశారు.
25 ఎకరాల విస్తీర్ణంలో:
కొత్త కల్యాణ మండపం,
అర్చకులు–సిబ్బంది క్వార్టర్స్,
ప్రాకారం, గోపురాలు,
పుష్కరిణి నిర్మాణాలకు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
ఇవీ చదవండి: Tirumala News : తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు
TTD : భక్తుల నుంచి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ
