HomeCrime NewsTelangana : ఖాకీ ప్రతిష్టకు చెడ్డపేరు… సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేశాడా? అంబర్‌పేట్ ఎస్‌ఐ భానుప్రకాష్ వెనుక...

Telangana : ఖాకీ ప్రతిష్టకు చెడ్డపేరు… సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేశాడా? అంబర్‌పేట్ ఎస్‌ఐ భానుప్రకాష్ వెనుక షాకింగ్ కథ!

Telangana : హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ పేరు ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారులు తప్పకూడని అక్రమాల్లో పాల్గొనడంతో మొత్తం శాఖ ప్రతిష్టకే భంగం వాటిల్లింది.

2020 బ్యాచ్‌కు చెందిన ఈ ఎస్‌ఐ ఇటీవల 4 తులాల బంగారం చోరీ కేసును విచారించాడు. కేసులో రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు తిరిగి ఇవ్వకుండా—
“త్వరలో ఇస్తా…” అని నమ్మబలికి, లోక్ అదాలత్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు.
కేసు ముగిసిన తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా… దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. విచారణ నివేదిక పైస్థాయికి చేరడంతో భానుప్రకాష్‌పై కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేశారు.

అయితే ఇదే పెద్ద షాక్ అనుకునేలోపే, మరో భయంకర నిజం వెలుగులోకి వచ్చింది…

సర్వీస్ పిస్టల్ గల్లంతు – ఎలా? ఎక్కడ?
భానుప్రకాష్ ఇటీవలే స్టేషన్‌కు వచ్చి,
“నా 9MM సర్వీస్ పిస్టల్ కనిపించడం లేదు!”
అని ఆరోపిస్తూ గోల చేశాడు.
డ్రా చెక్ చేస్తే బుల్లెట్లు మాత్రమే బయటకు వచ్చాయి. పిస్టల్ మాత్రం ఎక్కడా లేదు.
సీసీ కెమెరాలను పరిశీలించగా —
రికవరీ బంగారాన్ని డ్రాలో పెట్టి తర్వాత అదే డ్రా నుంచి ఏదో తీసుకెళ్తున్న దృశ్యాలు సాక్ష్యాలుగా లభించాయి.

పిస్టల్ సంగతి అడిగితే —
“డ్రాలో పెట్టాను… ఏమైందో తెలియదు…”
అని తప్పించుకునే సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

బెట్టింగ్ వ్యసనం… 70–80 లక్షల అప్పు… తర్వాతి అక్రమాలు!
విచారణలో భానుప్రకాష్ బెట్టింగ్‌కు బానిసై, దాదాపు ₹70–80 లక్షలు పోగొట్టుకున్నాడని బయటపడింది. భారీ అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ అక్రమాలకు పాల్పడ్డాడని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ లోపే…
“నాకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 ఉద్యోగం వచ్చింది…”
అని స్టేషన్‌కి వచ్చి చెప్పి, తన వస్తువులు తీసుకెళ్లిన సందర్భంలోనే పిస్టల్ మిస్సింగ్ డ్రామా బయటపడింది.

గన్‌ను ముఠాలకు అమ్మేశాడా? టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు వేగం
ఈ 9MM పిస్టల్‌ను రాయలసీమ గ్యాంగ్‌లకు లేదా ఇతర క్రిమినల్ ముఠాలకు అమ్మేశాడా? అన్న అనుమానంతో టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది.

ప్రస్తుతం రికవరీ సొత్తు దుర్వినియోగంపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.
అయితే సర్వీస్ గన్ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు!

ఇవీ చదవండి: Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు