శనివారం, 12 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Cinema

Janhvi Kapoor Weight Loss Secret: జాన్వీ చెప్పిన సింపుల్ ట్రిక్‌తో వెయిట్ లాస్… వినగానే షాక్ అవ్వడం ఖాయం!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 22 నవంబర్ 2025

Janhvi Kapoor Weight Loss Secret: ఇప్పుడు ఎక్కువమందిని వేధిస్తున్న పెద్ద సమస్య అధిక బరువు. తగ్గేందుకు జిమ్‌లో గంటల కొద్దీ చెమటోడ్చడం, కఠినమైన డైట్ ప్లాన్‌లు ఫాలో కావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం జిమ్‌ కష్టాలు, స్ట్రిక్ట్ డైట్స్ కంటే వేరే సింపుల్ హ్యాబిట్‌తోనే ఫిట్‌గా ఉండగలమని చెబుతోంది.

అది కూడా ఎవరంటే… టాలీవుడ్‌లో ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్!

జాన్వీ వెయిట్ లాస్ సీక్రెట్ ఏమిటంటే…
జాన్వీ కపూర్ ఇటీవల ఆమె సినిమా ప్రమోషన్‌ల్లో పాల్గొంటూ ఒక సింపుల్‌, సైన్స్ బ్యాక్డ్ ఈటింగ్ హ్యాక్‌ని రివీల్ చేసింది. జిమ్‌లో బాడీ కష్టపెట్టాల్సిన అవసరం లేకుండా, ఒక చిన్న హ్యాబిట్ మార్చడం ద్వారా బరువు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చని చెప్పింది.

► ఆమె హ్యాక్ — ఆహారాన్ని నిదానంగా, పూర్తిగా నములుతూ తినడం.
చిన్న పోర్షన్‌లలో తీసుకుని, ఒక్కో బైట్‌ను జాగ్రత్తగా, మెత్తగా నములుతూ తింటే డైజెషన్ బాగా జరుగుతుంది, అలాగే ఓవర్ ఈటింగ్ తగ్గిపోతుందని జాన్వీ తెలిపింది.

ఈ విషయం ఆమె ‘పరమ్ సుందరి’ మూవీ ప్రమోషన్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్ట్రీట్ ఫుడ్ తింటూ వెల్లడించింది.

సైన్స్ ఏమంటోందంటే…

జాన్వీ చెప్పిన ఈ హ్యాక్ సైన్స్‌కు కూడా సరిపోతుంది.
కాలిఫోర్నియా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పల్ మానిక్కం ఇచ్చిన సూచన ప్రకారం—

ప్రతి బైట్‌ను కనీసం 32 సార్లు నమలాలని ఆయన అంటున్నారు.

ఎందుకంటే “మనకు 32 పళ్లు ఉన్నాయి కాబట్టి 32 చ్యూస్ ఐడియల్” అని ఆయన చెప్తున్నారు.

ఇలా నిదానంగా తినడం వల్ల ఫుడ్ సరిగా జీర్ణమవుతుంది, హంగర్ హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి, తద్వారా వెయిట్ లాస్ సహజంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తన స్లిమ్ ఫిగర్‌కు ఇదే ఒక ముఖ్యమైన సీక్రెట్ అని జాన్వీ చెప్పడంతో ఈ హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

ఇవీ చదవండి: Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో మొదలైన ప్రేమకథ.. ఎంగేజ్‌మెంట్ వరకు.. జాన్వీ సోదరి
Cannes Film Festival 2025 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్ సందడి

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading