HomeTelanganaTelangana : తెలంగాణ యంగ్ రైటర్స్ కాంపిటీషన్-2025

Telangana : తెలంగాణ యంగ్ రైటర్స్ కాంపిటీషన్-2025

Telangana : కాంగ్రెస్‌ ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవం సందర్భంగా ఆపన్నహస్తం సోషల్ మీడియా వింగ్ తెలంగాణ యంగ్ రైటర్స్ కాంపిటీషన్-2025 నిర్వహిస్తోంది. తెలుగు భాషపై పట్టు, సృజనాత్మక శైలిలో రచనలు రాయగల తెలంగాణ యువత ఈ పోటీలో పాల్గొని నగదు బహుమతులు గెలుచుకోవచ్చు.

మూడు విభాగాలుగా జ‌రిగే ఈ పోటీలో మొదటి విభాగం కింద తెలంగాణ అంటే మీ దృష్టిలో ఏమిటో వివరిస్తూ 500 పదాల‌కు మించకుండా వ్యాసం రాయాలి. రెండో విభాగంలో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ, రిజీనల్ రింగ్ రోడ్ (RRR), యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, హైడ్రా అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని, అది తెలంగాణ భవిష్యత్తును ఏ విధంగా ఆవిష్కరిస్తుందో తెలియజేస్తూ 500 పదాలకు మించకుండా మీ అభిప్రాయాన్ని రాయాలి.

మూడో విభాగంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి పాలనను వివరిస్తూ కవిత లేదా పాటను రాసి పంపాలి. మీరే పాడి వీడియో కూడా పంపవచ్చు. ఉత్తమ రచనలను పుస్తకరూపంలో ప్రచురిస్తారు. మొదటి బహుమతి రూ. 10 వేలు, రెండో బహుమతి రూ. 5 వేలు, ఐదుగురికి రూ. వెయ్యి చొప్పున కన్సోలేషన్ ప్రైజులు అందిస్తారు.

రచనలు సమర్పించాల్సిన‌ లింక్: https://forms.gle/Rg4V7TsuJDDRjMWdA – పూర్తి వివరాల కోసం వాట్సాప్: 91604 84304 సంప్రదించవచ్చు.

ఇవీ చదవండి: Telangana : బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్.. యువతకు బంగారు అవకాశాలు!
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు