Raghavendra Rao : ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒక వీడియో కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మెగా కాంపౌండ్‌కు చెందిన నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారికతో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏం జరిగింది?
ఒక సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిహారిక కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన నిహారికను దగ్గరకు తీసుకొని, ఆమె నడుముపై చెయ్యి వేసి ఇబ్బందికరంగా మాట్లాడారు.
వీడియోను గమనిస్తే, రాఘవేంద్రరావు గట్టిగా నొక్కి పట్టుకోవడంతో, నిహారిక వెంటనే తన నడుముపై ఉన్న చెయ్యిని తీసేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. ఆమె వెంటనే వెనక్కి జరిగి, కొంత దూరం నుంచే ఆయనతో మాట్లాడసాగింది. రాఘవేంద్రరావు ప్రవర్తనతో నిహారిక స్పష్టంగా ఇబ్బందిపడినట్లు ఆ దృశ్యాలలో వ్యక్తమవుతోంది.
నెటిజన్లు, మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహం
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే, సినీ అభిమానులు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మరియు సాధారణ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యక్తిగత ప్రవర్తనపై ఫైర్: తన సినిమాలలో మహిళలను చాలా బోల్డ్‌గా చూపించే రాఘవేంద్రరావు, బయట కూడా మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. “ఈ వయసులో ఇదేం బుద్ధి?” అంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు.
“మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. “ఒక ఆడపిల్ల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించవచ్చా?” అని ప్రశ్నిస్తూ, గతంలో ఆయనను ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎలా నియమించారంటూ నిలదీస్తున్నారు.
సినిమా పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, కానీ విలువలు లేని వ్యక్తుల వికృత చేష్టలకు మాత్రం వ్యతిరేకమని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల గౌరవం చూపడం అనేది వయసుతో సంబంధం లేకుండా పాటించాల్సిన కనీస నైతిక విలువ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: Top 10 Movies: టాలీవుడ్ హిస్టరీలో ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ ఇవే..!
Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు
