HomeInternationalTop Gold : ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం? భారత్ స్థానం?

Top Gold : ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం? భారత్ స్థానం?

Top Gold : బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. అది ఒక దేశ ఆర్థిక బలానికి ప్రతీక. డాలర్ విలువ, యుద్ధ పరిస్థితులు, వాణిజ్య మార్పులు వంటి అంశాల కారణంగా బంగారం ధర రోజురోజుకు ఎగబాకుతోంది. ప్రస్తుతం పదిగ్రాముల బంగారం ధర లక్షా 15 వేల రూపాయలకు చేరువలో ఉంది.

ప్రపంచంలో బంగారు నిల్వలు
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం (2025 రెండవ త్రైమాసికం):
అమెరికా: 8,133.46 టన్నులు – దశాబ్దాలుగా అగ్రస్థానం
జర్మనీ: 3,350.25 టన్నులు – రెండవ స్థానం
ఇటలీ: 2,451.84 టన్నులు – మూడవ స్థానం

ఫ్రాన్స్: 2,437 టన్నులు – నాల్గవ స్థానం
రష్యా: 2,335 టన్నులు – ఐదవ స్థానం
చైనా: 2,279 టన్నులు – ఆరో స్థానం (అత్యధిక ఉత్పత్తి దేశం కూడా)
స్విట్జర్లాండ్: 1,040 టన్నులు – ఏడవ స్థానం
భారతదేశం: 880 టన్నులు – ఎనిమిదవ స్థానం

భారత్ స్థానం
భారత్ వద్ద ప్రస్తుతం 880 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయిగా పరిగణించబడుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో 8వ అతిపెద్ద బంగారం నిల్వల దేశంగా నిలిచింది.

బంగారం ప్రాముఖ్యత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం భద్రత, స్థిరత్వం, సంపదకు చిహ్నం. అనిశ్చితి సమయంలో బంగారం దేశాలకు ఆర్థిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే, డిజిటల్ కరెన్సీలు, క్రిప్టో వేవ్ ఉన్నా కూడా, బంగారం స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేకపోతుంది.

ఇవీ చదవండి: Gold Price : బంగారం ధర లక్షకు చేరుకోవడానికి కారణాలేంటి?
Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు చుక్కలు చూపించాడు.. లక్షలు సేఫ్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు