Tirumala News : తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, వర్చువల్ సేవలు, గదుల కోటా వంటి వివరాలను దేవస్థానం వెల్లడించింది.
🔹 ఆర్జిత సేవా టికెట్లు
డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఇదే విధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయబడతాయి.
🔹 లక్కీడిప్ కేటాయింపు
ఈ టికెట్లకు దరఖాస్తు చేసినవారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు పూర్తి చేసిన పక్షంలో లక్కీడిప్ ద్వారా టికెట్లు మంజూరు అవుతాయి.
🔹 22న ప్రత్యేక టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు – సెప్టెంబర్ 22 ఉదయం 10 గంటలకు.
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా – అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు.
🔹 23న శ్రీవాణి & ప్రత్యేక దర్శన కోటా
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు – సెప్టెంబర్ 23 ఉదయం 11 గంటలకు.
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు – సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు.
🔹 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం & గదుల కోటా
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు – సెప్టెంబర్ 24 ఉదయం 10 గంటలకు.
తిరుమల, తిరుపతిలో గదుల కోటా – అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు.
భక్తులు అన్ని సేవలు, దర్శన టికెట్లను TTD అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా బుక్ చేసుకోవచ్చని దేవస్థానం తెలియజేసింది.
ఇవీ చదవండి: Rivaba Jadeja : తిరుమల శ్రీవారిని దర్శించిన జడేజా సతీమణి
Tirumala News : ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు
Tirumala News : 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
